Sreeja: మూడో సారి పెళ్లికి శ్రీజ సిద్ధమైందా అంటున్న నెటిజన్లు..!

సినిమాల్లో నటించపోయినా వ్యక్తిగత జీవితం కారణంగా మెగా డాటర్ కొణిదెల శ్రీజ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా ఆమె దాదాపు అందరికీ సుపరిచితురాలే. చిరంజీవి చిన్న కూతురిగా ఒకానొక టైంలో హీరోయిన్ అవుదామని చాలా ప్రయత్నించిందట. ఆ విషయంలో సురేఖ ఫుల్ సపోర్ట్ ఇచ్చిందట. సినిమా ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందో.. కొన్ని దశాబ్దాలుగా ఉంటున్న చిరంజీవికి బాగా తెలుసు కాబట్టి..

హీరోయిన్ అవ్వాలనే ఆశలు ఏమైనా ఉంటే మర్చిపోండి అంటూ కూతుర్లకు వార్నింగ్ ఇచ్చారట. అందుకే శ్రీజ ఇండస్ట్రీకి దూరమైంది. మొదట్లో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి ఇంట్లో చెప్పకుండా పోయి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు కాపురం చేసి ఓ బిడ్డకు జన్మ నిచ్చింది. ఆయనతో అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయి మళ్లీ తన తండ్రి చిరంజీవి దగ్గరికి వచ్చింది. ఈమె ఆ తర్వాత బంధువుల అబ్బాయి అయిన కళ్యాణ్ దేవ్ ని రెండో పెళ్లి చేసుకుంది.

అతడితో కూడా ఒక బిడ్డ కని ఆ తర్వాత విడాకులు తీసుకుని దూరమైంది. ఇలాంటి సమయంలోనే శ్రీజకు సంబంధించిన మరొక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు శ్రీజ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీనితో ఈమె మళ్లీ పెళ్లి చేసుకోబోతోందన్న పుకార్లు వెళ్లువెత్తాయి. నెటిజన్లు కూడా అదే నిజం అని కామెంట్లు చేస్తున్నారు.

ఇక అసలు నిజం ఏంటంటే.. తాజాగా జిమ్‎లో శ్రీజ (Sreeja) వర్కౌట్ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో షేర్ చేసింది. ఈ వీడియోలో తన జిమ్ ట్రైనర్ ఆమెకు ఎన్నో రకాల కసరత్తులు నేర్పిస్తున్నారు. చివరిగా ఆ వ్యక్తితో కలిసి ఉన్న ఫోటోతో ఎండ్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus