Srinu Vaitla: ఈ యంగ్ హీరో శ్రీనువైట్ల జాతకాన్ని మార్చేస్తాడా?

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వెలుగు వెలిగిన శ్రీనువైట్ల ప్రస్తుతం సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. బాద్ షా సినిమా తర్వాత ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ నష్టాలను మిగిల్చాయి. ఈ డైరెక్టర్ తో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు సైతం ఇష్టపడటం లేదు. స్టార్ హీరోలు ఈ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మంచు విష్ణు శ్రీనువైట్ల కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు.

అయితే ఎట్టకేలకు శ్రీనువైట్లకు బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ అయినా శ్రీనువైట్ల జాతకాన్ని మారుస్తారేమో చూడాలి. బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరి అంతకాలం శ్రీనువైట్ల ఎదురుచూస్తారో లేదో చూడాలి.

ఛత్రపతి సినిమాతో హిందీలో మార్కెట్ ను పెంచుకోవాలని బెల్లంకొండ శ్రీనివాస్ భావిస్తున్నారు. బెల్లంకొండ తర్వాత సినిమాల ఫలితాలను బట్టి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందో రాదో డిసైడ్ కానుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీనువైట్లకు పూర్వ వైభవం వస్తుందో లేదో చూడాలి.

(Srinu Vaitla )శ్రీనువైట్ల కెరీర్ విషయంలో ఇకనైనా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. శ్రీనువైట్ల రెమ్యునరేషన్ గతంతో పోల్చి చూస్తే భారీస్థాయిలో తగ్గిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కోన వెంకట్, గోపీ మోహన్ దూరం కావడమే శ్రీనువైట్లకు మైనస్ అయిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ తో శ్రీనువైట్ల ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో చూడాలి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus