మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ లో ‘వెంకీ’ ఓ స్పెషల్ మూవీ. అతన్ని ‘నీకోసం’ తో హీరోగా నిలబెట్టిన దర్శకుడు శ్రీను వైట్లతో చేసిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. టీవీల్లో ఎన్ని సార్లు చూసినా.. యూట్యూబ్ లో వందలాది సార్లు చూసినా తనివి తీరని మూవీ ఇదని చెప్పవచ్చు. 2004 లో సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ మొదట యావరేజ్ టాక్ తో మొదలై.. ఆ తర్వాత హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
‘ఆర్య’ సినిమా వచ్చే వరకు ‘వెంకీ’ హవా నడిచింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా వరకు ట్రైన్లోనే ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే కామెడీ సీన్స్.. అందరినీ నవ్వించడమే కాకుండా విజిల్స్ కూడా వేయిస్తాయి అని చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ పోలీస్ హెడ్ కోటర్స్ లో వచ్చే థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఎక్కడా కూడా బోర్ కొట్టని సినిమా ఇది.’ఆర్య’ వంటి సినిమా పోటీగా ఉన్నప్పటికీ కూడా 79 కేంద్రాల్లో 50 రోజులు, 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడి మంచి సక్సెస్ అందుకుంది ‘వెంకీ’ చిత్రం.
ఇక ఇప్పుడు రీ రిలీజ్ ల హవా నడుస్తున్న సమయంలో (Venky) ‘వెంకీ’ కూడా రీ రిలీజ్ కాబోతుంది. కాకపోతే డిసెంబర్ 30 న న్యూ ఇయర్ కానుకగా రీ రిలీజ్ అవుతుందట. ‘వెంకీ’ కి ఉన్న కల్ట్ ఫ్యాన్స్ వల్ల.. ఈ టైంలో కనుక రీ రిలీజ్ అయితే.. రికార్డు కలెక్షన్స్ నమోదు చేయడం గ్యారెంటీ అని చెప్పాలి.