ఒక్కోసారి సినిమాలో కంటెంట్ ఉన్నా లేకపోయినా.. ప్రేక్షుకులకు కనెక్ట్ అయితే మాత్రం అది పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోతుంటుంది. అయితే అంత పెద్ద ఫలితాన్ని ఆశించని మేకర్స్.. రెట్టింపు ఉత్సాహంతో ఆ సినిమాని ప్రమోట్ చేస్తుంటారు.అక్కడ వరకూ పర్వాలేదు. కానీ ‘ఈ స్థాయిలో తీస్తేనే అంత పెద్ద హిట్ అయిపోయింది కాదా, మరి ఈ సినిమాలో హైలెట్స్ అని చెప్పిన పాయింట్స్ నే ఎక్కువగా పెంచేసి తరువాతి సినిమా తీస్తే మరింత బ్లాక్ బస్టర్ అవుతుంది’ అని భావించి అదే ఫార్మేట్ లో సినిమాలు తీస్తే ఎక్కడా లేని ఇబ్బందులు వస్తుంటాయి.
ఉదాహరణకి మన పూరి జగన్నాథ్ నే తీసుకుందాం. అతను తెరకెక్కించిన సినిమాల్లో ‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ ‘సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది అని తనే అనుకోలేదు’ అని చాలా సందర్భాల్లో కామెంట్స్ చేసాడు. అక్కడితో ఆగలేదు చాలా సార్లు ‘ఆ సినిమా ఎందుకు తీసానా’ అని బాధపడుతుంటాను అని చెప్పుకొస్తుంటాడు. తరువాత అతను తీసిన సినిమాలన్నీ ‘ ‘పోకిరి’ తో పోల్చి అట్టర్ ప్లాప్ లు చేసారు’ అని అతని బాధ అయ్యుండొచ్చు. ఇప్పుడు సరిగ్గా అల్లరి నరేష్ కూడా అలాగే ఫీలవుతున్నట్టు చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ కు ‘సుడిగాడు’ సినిమా గురించి ప్రశ్న ఎదురైంది.
దానికి అల్లరి నరేష్ స్పందిస్తూ.. ” ‘సుడిగాడు’ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం.. నాకు పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. ఆ చిత్రం పెద్ద విజయం సాధించడం వల్ల…దానిని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. కేవలం కామెడీ వల్లే ఆడేసింది.. అని మా యూనిట్ సభ్యులు అంతా అనుకున్నాం. ఇంతకన్నా ఎక్కువ కామెడీతో సినిమా చేస్తే అది ఇంకా పెద్ద హిట్ అవ్వుద్ది అనుకున్నాం. కానీ ప్లాన్ రెవర్స్ అవుతూ వచ్చింది. కామెడీతో పాటు కథ, కంటెంట్ కూడా ఉండాలని తరువాత అర్థం అయ్యింది” అంటూ చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!