‘నాంది’ సినిమాతో సమాజంలోని ఓ అంశాన్ని చర్చించి.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు నరేశ్, విజయ్. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలసి ‘ఉగ్రం’ అంటూ వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల వేడుక ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో చెప్పిన కొన్ని విషయాలు సినిమా ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతోంది అనేది తెలిసిపోయింది. తొలి సినిమాలాగే ఈ సినిమాలో కూడా హాట్ టాపిక్‌ను డిస్కస్ చేయబోతున్నారట.
‘ఉగ్రం’ సినిమా కథపై రీసెర్చ్ చేస్తుంటే… లాక్‌డౌన్ సమయంలో మన దేశంలో 1,50,000 మంది మిస్సైన విషయం తెలిసిందని అల్లరి నరేశ్ తెలిపారు. ‘మహర్షి’ సినిమాలో నరేశ్ పోషించిన పాత్ర నచ్చడంతో అలాంటి రోల్‌లో ఓ సినిమా చేద్దామని దర్శకుడు విజయ్ కనకమేడల అడిగారని నరేశ్ చెప్పారు. కామెడీ ఇమేజ్ ఉన్న తననను ప్రేక్షకులు సీరియస్ క్యారెక్టర్‌లో చూస్తారా అనే డౌట్ పడ్డారట నరేశ్. అలా రిస్క్ చేద్దామంటూ ‘నాంది’ చేశాం అని చెప్పారు.
ఆ సినిమా విజయం అందుకోవడంతో… ‘ఉగ్రం’ కథ చెప్పారని తెలిపారు. ‘నాంది’ సినిమాకు మించి ఈ సినిమా ఉంటుందని నరేశ్ తెలిపారు. ‘నాంది’ సినిమాలో అండర్ ట్రైల్ ఖైదీల గురించి చెప్పాం. ఇప్పుడు ‘ఉగ్రం’ సినిమాలో మిస్సింగ్ కేసుల గురించి చూపించబోతున్నాం అని సినిమా ప్లాట్‌ను వివరించారు. కథ కోసం మేం రీసెర్చ్ చేస్తున్నప్పుడు.. మన దేశంలో లాక్‌డౌన్ సమయంలో 1.5 లక్షల మంది మిస్సయ్యారనే విషయం తెలిసిందని తెలిపారు.
అలా మిస్ అయిన లక్షన్నర మంది ఏమయ్యారనే విషయంలో ఇప్పటివరకు తెలియదు అని.. టాపిక్ సీరియస్‌నెస్‌ను వివరించారు నరేశ్. ఇక ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘నాంది’ సినిమాతో అదరగొట్టిన ఈ కాంబో మరిప్పుడు ‘ఉగ్రం’తో ఏం చేస్తుందో చూడాలి. ఇలాంటి కథలు మన దగ్గర కూడా చేయగలం అని ‘నాంది’తో చూపించారు. ఇప్పుడు ‘ఉగ్రం’ సినిమాతో దాన్ని కొనసాగిస్తున్నారు.. మరి ఈ సినిమా ఎంతమేర ప్రభావం చూపిస్తుందో చూడాలి.