Allari Naresh: సినిమాల పరంగా ఇది నా షష్టిపూర్తి!

అల్లరి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నరేష్ మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకొని సినిమా పేరుని తన ఇంటిపేరుగా మార్చుకొని అల్లరి నరేష్ గా మారిపోయాడు. అయితే ప్రస్తుతం అల్లరి నరేష్ కాస్త హీరో నరేష్ గా మారిపోయారని తెలుస్తోంది.ఈ మధ్యకాలంలో కామెడీ సినిమాలకు దూరం అయ్యి తనలో మరొక యాంగిల్ కూడా ఉందంటూ భయపెట్టే సీరియస్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ కనకమెడల దర్శకత్వంలో అల్లు అర్జున్ నరేష్ హీరోగా నటించిన సినిమా ఉగ్రం.

ఈ సినిమా మే 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో నరేష్ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఉగ్రం సినిమాలో తాను ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నానని తెలిపారు.

ఇదివరకు తాను పోలీస్ ఆఫీసర్ పాత్రలలో నటించి కామెడీ చేశానని కానీ ఇందులో మాత్రం ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నానని తెలియజేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే కరోనా సమయంలో లక్ష అరవై వేల మంది కనిపించకుండా పోతారు అలా కనిపించకుండా పోయిన వారి కొంతమంది వివరాలు మాత్రమే తెలుస్తాయి. మిగిలిన వారందరూ ఏమయ్యారనేదే ఈ సినిమా కథాంశమని నరేష్ తెలిపారు. నా మొదటి సినిమా అల్లరి 2002 మే 10వ తేదీ విడుదల అయింది.

ఇప్పుడు నటిస్తున్న ఉగ్రం సినిమా (Allari Naresh) నా 60వ సినిమా. సినిమాలపరంగా ఇది నాకు షష్టిపూర్తి. ఇక నా తదుపరి సినిమా కామెడీ జోనర్ లోనే ఉంటుందని నరేష్ తెలియజేశారు. అయితే తనకు ఎప్పటినుంచో నాకు ఇంగ్లిష్ జోకర్ పాత్ర చేయాలని కల. నాంది నుండి సామాజిక బాధ్యతతో సందేశాత్మక చిత్రాలలో నటిస్తున్నాను. కామెడీ చేసే హీరో ఎలాంటి పాత్రలలోనైనా నటించగలరని నరేష్ తెలిపారు.వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఉగ్రం సినిమాని ప్రతి ఒక్కరు థియేటర్ లో చూసి ఆదరించండి అని నరేష్ తెలియజేశారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus