Allu Aravind Fourth Son: అల్లు అరవింద్ కు ఇంకో కొడుకు ఉన్నాడా.. షాకిచ్చిన శిరీష్!

దివంగత నటులు, కమెడియన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన అల్లు రామలింగయ్య గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1000 కి పైగా సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించారాయన. తర్వాత ఆయన వారసుడిగా అల్లు అరవింద్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట ఆయన నటుడిగా హీరో, చంటబ్బాయి వంటి సినిమాల్లో నటించారు. కానీ నటన పై ఆయనకు మక్కువ లేకపోవడంతో నిర్మాణరంగం వైపు మళ్లారు. అల్లు రామలింగయ్య గారు స్థాపించిన ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ ను హ్యాండోవర్ చేసుకుని ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందించారు.

ఇక అల్లు అరవింద్ కు కూడా ముగ్గురు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. వాళ్ళే అల్లు వెంకటేష్(బాబీ), అల్లు అర్జున్, అల్లు శిరీష్..! ఇందులో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఇండియా మొత్తం ఫేమస్ అయ్యాడు. అల్లు శిరీష్ హీరోగా పలు సినిమాల్లో నటించి హిట్లు అందుకున్నాడు. ఈ మధ్యనే ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శిరీష్. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది కానీ వసూళ్ల పరంగా నిరాశపరిచింది.

ఇక అల్లు వెంకటేష్(బాబీ) అయితే ఈ ఏడాది ‘గని’ చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్… ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు కానీ ఇది పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే వీళ్ళు కాకుండా అల్లు అరవింద్ కు మరో కుమారుడు కూడా జన్మించాడట.అతని పేరు అల్లు రాజేష్. వెంకటేష్ తర్వాత రాజేష్ రెండో కుమారుడుగా అల్లు అరవింద్ కు జన్మించాడు. అయితే 5 ఏళ్ళ వయసుకే రోడ్డు ప్రమాదంలో మరణించాడు రాజేష్.

ఆ టైంకి అల్లు శిరీష్ ఇంకా జన్మించలేదట. ఈ విషయాన్ని అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రమోషన్స్ లో బయటపెట్టాడు. అల్లు శిరీష్ ఈ విషయం రివీల్ చేయడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే కొంతమందికి అల్లు రాజేష్ గురించి ముందుగా తెలిసుండొచ్చు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus