Allu Arha: బన్నీ కోసం గరిట పట్టిన అల్లు అర్హ..?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ కు కొన్ని రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉండి కరోనాకు చికిత్స చేయించుకుంటున్న అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఆరోగ్యానికి సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ త్వరగా వైరస్ నుంచి కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే అల్లు అర్హ తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు.

బన్నీ కోసం ఏకంగా గరిటె పట్టి దోశ వేశారు. అల్లు అర్హ దోశ వేస్తున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ సమయంలో రాములో రాములా పాట స్టెప్పులు దోశ స్టెప్పులు అంటూ అర్హ గాలి తీసేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం అర్హ నాన్నపై ప్రేమతో స్పెషల్ గా దోశ వేసింది. బన్నీ అర్హ దోశలు వేసిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అర్హ దోశ వేయడం గురించి అల్లు అర్జున్ స్పందిస్తూ అర్హ నాన్నకు స్పెషల్ దోశ వేసిందని దోశ స్టెప్పులను ఆదర్శంగా తీసుకొని అర్హ ఇలా దోశ వేసిందేమోనని అన్నారు. జీవితంలో ఇది మరిచిపోలేని దోశ అంటూ దోశ గురించి బన్నీ కామెంట్లు చేశారు. మరోవైపు బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 50 శాతం మాత్రమే పూర్తైందని తెలుస్తోంది.


‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus