Pawan Kalyan: పవన్ రీమేక్ సినిమాలో బన్నీ కూతురు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పూర్తయిన తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా తమిళ ‘తేరి’ సినిమాకి రీమేక్ అనే విషయం తెలిసిందే. రీమేక్ అయినప్పటికీ.. హరీష్ శంకర్ కేవలం స్టోరీ లైన్ మాత్రమే తీసుకొని స్క్రీన్ ప్లే పూర్తిగా పవన్ ఇమేజ్ కి తగ్గట్లుగా మార్చేశారు.

రైటర్, దర్శకుడు దశరథ్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఎలా వుండబోతుందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘తేరి’ సినిమాను ‘పోలీసోడు’ పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు దిల్ రాజు. ఆల్రెడీ తెలుగులో రిలీజైన సినిమాను మళ్లీ రీమేక్ చేయడంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హీరో కూతురు రోల్ ఒకటి ఉంటుంది. ఆ పాత్రలో ఒకప్పటి హీరోయిన్ మీనా కూతురిని తీసుకున్నారు.

ఆమె క్యారెక్టర్ నుంచే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలవుతుంది. ఇప్పుడు తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ కూతురిగా ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. బన్నీ కూతురు అల్లు అర్హ.. పవన్ సినిమాలో కనిపిస్తుందని టాక్. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమెకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను బన్నీ-స్నేహ దంపతులు ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు.

సమంత ‘శాకుంతలం’ సినిమాతో అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఆమెని తీసుకోవాలనుకుంటున్నారట. ఈ విషయంపై ఇప్పటికే హరీష్ శంకర్.. అల్లు ఫ్యామిలీను సంప్రదించినట్లు సమాచారం. మరి ఈ విషయంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus