ఆ మూవీతో బన్నీ లైఫ్ ఛేంజ్ అయిందా..?

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కి 2004 సంవత్సరం మే నెల 7వ తేదీన విడుదలైన ఆర్య సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు యూత్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా విడుదలై 17 సంవత్సరాలు కావడంతో అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. తన లైఫ్ ఛేంజింగ్ విషయాల్లో ఆర్య ఒకటని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

తన జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం ఆర్య అని ఈ సినిమా రిలీజై నేటికి సరిగ్గా 17 సంవత్సరాలు అవుతోందని అల్లు అర్జున్ వెల్లడించారు. ఫీల్ మై లవ్ అనే పదాలు నేను చెప్పిన తరువాత ప్రేక్షకులు తమ ప్రేమను నాపై కురిపించారంటూ అల్లు అర్జున్ తన ట్వీట్ ను ముగించారు. అల్లు అర్జున్ చేసిన ట్వీట్ కు వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ కాలేజ్ స్టూడెంట్ గా, వన్ సైడ్ లవర్ గా అద్భుతంగా నటించారు.

తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా భారీగా కలెక్షన్లను సాధించి బన్నీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో అను మెహతా గీత పాత్రలో నటించగా శివబాలజీ అజయ్ పాత్రలో నటించారు. దిల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సుకుమార్ ఆర్య సినిమాతో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ టీవీలలో ఆర్య సినిమా మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటోంది.


Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus