అల్లు అర్జున్ ఈ ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ చిత్రం తరువాత సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా ‘పుష్ప’ చిత్రం షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించనున్నారు. ఇక ‘పుష్ప’ తరువాత కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి కూడా బన్నీ ఓకే చెప్పినట్టు.. కొద్ది రోజుల నుండీ టాక్ నడుస్తుంది.
ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. దాదాపు ఈ కాంబినేషన్ ఫిక్స్ అనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తుంది. ‘ఆచార్య’ చిత్రం తరువాత దర్శకుడు కొరటాల శివ.. అల్లు అర్జున్ తో సినిమా చెయ్యడానికి ఇంట్రెస్ట్ చుపిస్తున్నాడట. ఈ లాక్ డౌన్ టైంలో తన దగ్గర ఉన్న ‘స్టూడెంట్ పాలిటిక్స్’ స్క్రిప్ట్ ను డెవలప్ చేసుకున్నాడని సమాచారం. ఈ స్క్రిప్ట్ కు అల్లు అర్జున్ అయితేనే కరెక్ట్ అని కొరటాల శివ భావిస్తున్నాడట. కొరటాల శివ సినిమాలో కచ్చితంగా ఓ సామజిక అంశం ఉంటుందన్న సంగతి తెలిసిందే.
అదే కనుక నిజమైతే బన్నీని స్టూడెంట్ లీడర్ గా చూడొచ్చని స్పష్టమవుతుంది. అంతేకాదు కొరటాల సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉండేలా చూసుకుంటాడు కాబట్టి కచ్చితంగా ఈ కాంబినేషన్ ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు.