కొంతమంది హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నా, ఆడియన్స్ లో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నా.. తర్వాత ఎందుకో నిలదొక్కుకోలేక త్వరగానే ఫేడౌట్ అయిపోయారు. ఈ లిస్టు చాలా పెద్దదే. అందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. కొంతమంది పోటీని తట్టుకోలేక.. ఇంకొంతమంది సరైన ప్రాజెక్టులు, పాత్రలు ఎంపిక చేసుకోలేక, మరికొంతమంది అయితే శరీరంలో వచ్చిన మార్పుల దృష్ట్యా కావచ్చు ఫేమ్ పోగొట్టుకుని ఇబ్బంది పడ్డారు.
అలాంటి వారిలో పూనమ్ బజ్వా ఒకరు. ‘మొదటి సినిమా’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ముంబై బ్యూటీ అయినప్పటికీ అచ్చ తెలుగమ్మాయిలా కనిపించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అటు తర్వాత ‘ప్రేమంటే ఇంతే’ ,నాగార్జున హీరోగా నటించిన ‘బాస్’ వంటి చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. కానీ అవి మంచి ఫలితాలు ఇవ్వలేదు. దీంతో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సి వచ్చింది.
అలా అల్లు అర్జున్ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో చేసిన ‘పరుగు’ సినిమా బాగానే ఆడింది.. కానీ అందులో ఆమెకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కలేదు. వాస్తవానికి పూనమ్ కి సంబంధించిన చాలా ఎపిసోడ్స్ ను ఎడిటింగ్లో లేపేసినట్టు టాక్ వినిపించింది.
దీంతో ఆమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసి తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించింది. దురదృష్టవశాత్తూ అక్కడ కూడా సక్సెస్ కాలేదు. కొన్నాళ్ళకి ‘ఓం’ చిత్ర దర్శకుడు సునీల్ రెడ్డిని.. సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆమె ప్రయత్నాలు ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈ క్రమంలో ‘బొద్దుగా ఉన్నా.. ముద్దుగా ఉంది’ అంటూ కొందరు నెటిజన్లు ఈమె పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈమె లేటెస్ట్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :