Allu Arjun: బన్నీ బర్త్ డే.. ఏమైనా ఉందా లేదా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టిన రోజు అంటే మామూలు వేడుక కాదు, ఫ్యాన్స్‌కి పండగే. ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డేకి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులో భాగంగా ఆయన సూపర్ హిట్ మూవీ ‘ఆర్య 2’ను (Aarya 2) మళ్లీ థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా, ఇప్పుడు హిందీలో కూడా ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. ప్రత్యేకంగా ఏప్రిల్ 5న ‘ఆర్య 2’ రీ రిలీజ్ ప్లాన్ కావడం, ఈ వేడుకను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నమే.

Allu Arjun

Allu Arjun to Make 2 Projects at a Time (1)

ఇక పుష్ప 2 (Pushpa 2) సినిమాతో దేశవ్యాప్తంగా మాస్ మార్కెట్‌ను దక్కించుకున్న బన్నీ, ఇప్పుడు తన బర్త్‌డేను మరింత గ్రాండ్‌గా మార్చే సూచనలు ఉన్నాయి. అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో బన్నీ నటించబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పటికే కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్, లేదా టైటిల్ అనౌన్స్‌మెంట్ వంటి ఏదైనా మెగా అప్‌డేట్ వస్తుందా అన్నది ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బర్త్‌డేను ఓ స్పెషల్ ఆఫరింగ్ గా మార్చే అవకాశం మేకర్స్‌కి ఉంది.

అలాగే త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో బన్నీ చేయబోయే సినిమా విషయమై కూడా ఫ్యాన్స్ ఆశలు పెంచుకున్నారు. ఇటీవల నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) చేసిన వ్యాఖ్యలతో ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని క్లారిటీ వచ్చింది. అయితే దీనికి సంబంధించి బర్త్‌డే రోజున ఏదైనా అప్‌డేట్ వస్తే మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. ఎందుకంటే త్రివిక్రమ్ ఆల్రెడీ ఆలస్యంగా స్క్రిప్ట్ వర్క్ చేయడంతో, ఇప్పటికైనా ఓ అనౌన్స్‌మెంట్ అయినా కావాలన్నదే ఫ్యాన్స్ ఆకాంక్ష.

ఇప్పుడు బన్నీ బర్త్‌డే రోజున ‘ఆర్య 2’ రీ రిలీజ్ ఖరారు అయింది. కానీ మరోవైపు అట్లీ సినిమా గ్లింప్స్, త్రివిక్రమ్ మూవీ అప్‌డేట్ వంటి అంశాలపై ఇంకా అధికారిక క్లారిటీ లేదు. అయినా ఫ్యాన్స్ మాత్రం భారీగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాతో బన్నీ 1900 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటి కొత్త బెంచ్‌మార్క్ పెట్టిన నేపథ్యంలో, ఆయన తదుపరి సినిమాలపైనా అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. మరి బన్నీ బర్త్‌డే నిజంగానే ఫ్యాన్స్‌ ఊహించినట్టే జరగబోతుందా లేక ఓ సింపుల్ రీ రిలీజ్‌కే పరిమితమవుతుందా అన్నది కొన్ని రోజుల్లో స్పష్టమవుతుంది.

బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ఎంపురాన్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus