Pushpa Movie: తగ్గేదే లె.. అన్నట్టు దూసుకుపోతున్న ‘పుష్ప’ టీజర్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూడో చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పుష్ప రాజ్ అనే ఊర మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు బన్నీ. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా.. ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించినప్పుడు.. ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి. అందుకు తగ్గట్టే టీజర్ ను కూడా అదిరిపోయేలా కట్ చేసి వదిలాడు సుకుమార్. ఇదిలా ఉండగా.. తాజాగా ‘పుష్ప’ టీజర్ అసాధారణమైన రికార్డుని సొంతం చేసుకుంది.టాలీవుడ్లో ఆల్రెడీ ఎక్కువ మంది వీక్షించిన టీజర్ గా నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. అంతేకాకుండా సౌత్ లో అత్యధిక వ్యూస్ నమోదు చేసిన రెండో టీజర్ గా కూడా నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ‘పుష్ప’.

ఇప్పటి వరకు సౌత్ లో ఎక్కువ వ్యూస్ నమోదు చేసిన టీజర్ గా ‘కె.జి.ఎఫ్ 2’ 191 మిలియన్స్ తో మొదటి స్థానంలో ఉండగా.. దీని తర్వాత రజినీకాంత్- శంకర్ ల ‘2.0’ టీజర్ 72.44 మిలియన్ వ్యూస్ తో రెండో ప్లేస్ లో ఉండేది. ఇప్పుడు రజినీ రికార్డును బ్రేక్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప’ 72.61 మిలియన్ వ్యూస్ తో టాప్ 2 ప్లేస్ లో కొనసాగుతుంది.రానున్న రోజుల్లో ఇది 100 మిలియన్ వ్యూస్ ను కూడా నమోదు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.


ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus