Allu Arjun: అర్హ, అయాన్ లతో దీపావళి సెలబ్రేట్ చేసుకున్న అల్లు అర్జున్..

ఈ అక్టోబర్ 24న దేశవ్యాప్తంగా.. అలాగే ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగువారు దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. అందరి జీవితాల్లోని చీకట్లు తొలగిపోయి, వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటూ.. మన సంసృతీ, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ.. దీపాల పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఫెస్టివల్ కి ఒకటి, రెండు రోజుల ముందుగానే తమ ఇళ్లల్లో దివాళీ బాష్ ఏర్పాటు చేశారు.

బాలీవుడ్ లో స్టార్ డిజైనర్ మనీష్ మల్హోత్రా పార్టీలో హిందీ స్టార్స్ అంతా కలిసి సందడి చేశారు. నిర్మాత దిల్ రాజు కూడా గ్రాండ్ పార్టీతో సందడి చేశారు. ఇక పండుగ ముందు రోజు ఆదివారం (అక్టోబర్ 23) రాత్రి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున తన ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. ఇంటి బయట ఓపెన్ గార్డెన్ లో రంగురంగుల దీపాలతో డెకరేట్ చేశారు. బన్నీ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి మెగా ఫ్యామిలీ నుండి యంగ్ స్టర్స్ అంతా వచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు సుస్మిత కొణిదెల, ఆమె భర్త, శ్రీజ, మెగా మేనళ్లుల్లు సాయి ధరమ్ తేజ్, వైైష్ణవ్ తేజ్, నిహరిక, దిల్ రాజు కుమార్తె, అల్లు శిరీష్ తదితరులు పాల్గొని ఆటపాటలతో, ఫన్ యాక్టివిటీస్ తో హంగామా చేశారు. తర్వాత అంతా కలిసి క్రాకర్స్ కాల్చారు.. బన్నీ దివాళీ పార్టీకి సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. రీసెంట్ గా ఐకాన్ స్టార్ తన ఇద్దరు పిల్లలు అర్హ, అయాన్ లతో కలిసి టపాసులు కాలుస్తున్న వీడియో చక్కర్లు కొడుతోంది.

పిల్లలిద్దరూ ట్రెడిషనల్ వేర్ లో ముద్దులొలికిస్తూ మెరిసిపోయారు. అర్జున్ దగ్గరుండి మరీ అర్హ, అయాన్ లతో కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్డులు కాల్పించి వారిని ఆనందాన్ని రెట్టింపు చేస్తూ సందడిగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus