Allu Arjun: మా నాన్న ఆ సినిమా రెమ్యునరేషన్‌ ఇవ్వలేదు: బన్నీ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌

అల్లు అర్జున్‌ – అల్లు అరవింద్‌… పేరుకే తండ్రీ కొడుకుల కానీ… ఇద్దరూ ఒక చోట చేరారు అంటే చేసే సందడి మామూలుగా ఉండదు. ఈ విషయం మనం కొన్ని టీవీ షోలు, ఓటీటీ షోల్లో చూశాం కూడా. ఇతర సందర్భాల్లోనూ ఈ విషయం చర్చకు వచ్చింది లెండి. ఇప్పుడు వాళ్ల అల్లరికి సోషల్‌ మీడియా వేదికైంది. ఈసారి మొదలుపెట్టింది అల్లు అర్జునే. మరి ఈ మాటకు అరవింద్‌ ఏం ఆన్సర్‌ ఇస్తారో తెలియదు కానీ… బన్నీ పోస్ట్‌ అయితే సూపర్‌గా ఉంది అని చెప్పాలి.

అంత సూపర్‌ పోస్ట్‌ ఏంటి అనుకుంటున్నారా? తన తండ్రి, నిర్మాత అరవింద్‌ ఓ సినిమాకి సంబంధించి రెమ్యునరేషన్‌ ఇవ్వలేదని అల్లు అర్జున్‌ గుర్తు చేశాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను స్టోరీలో పెట్టి రాసుకొచ్చాడు. అదేంటి అరవింద్‌ పేమెంట్స్‌ ప్రాంప్ట్‌గా ఉంటాయి కదా అంటారా? మొత్తం కథ చదివితే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే… ఇది ఇప్పటి సినిమాల చర్చ కాదు… బన్నీ బాలనటుడి టైమ్‌లోనిది.

చిరంజీవి హిట్‌ చిత్రాల్లో ‘విజేత’ ఒకటి. ఈ సినిమాను గీతా ఆర్ట్సే నిర్మించింది. అంతేకాదు బాల నటుడిగా ఈ సినిమాతోనే బన్నీ ఎంట్రీ ఇచ్చాడు కూడా. ఎ.కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా జ్ఞాపకాలను బన్నీ ఆదివారం గుర్తు చేసుకున్నాడు. ఆ సినిమా వంద రోజుల షీల్డ్‌తో అల్లు అరవింద్‌ ఉన్న ఓ ఫొటోను షేర్‌ చేస్తూ… ‘అన్నట్లు గుర్తొచ్చింది మా నాన్న ఈ సినిమాకు నాకు రెమ్యునరేషన్‌ ఇవ్వలేదు’ అని రాశాడు. దీంతో సోషల్‌ మీడియాలో ఆ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది.

ఇక బన్నీ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ సినిమాల సంగతి చూస్తే… రెండో సినిమాగా ‘స్వాతిముత్యం’ చేశాడు. ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు ‘డాడీ’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ఇప్పుడు ఏకంగా నేషనల్‌ బెస్ట్ యాక్టర్‌ అయ్యి అదరగొడుతున్నాడు. మరి ‘విజేత’ రెమ్యూనరేషన్‌ అల్లు అరవింద్‌ ఎప్పుడు ఇస్తారో చూడాలి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus