అల వైకుంఠపురంలో మూవీకి బన్నీ ఏ శుభముహూర్తాన సైన్ చేశారో కానీ ఆయన ఫేమ్ మరో స్థాయికి తీసుకెళ్లింది. నాపేరు సూర్య ప్లాప్ తరువాత బన్నీ ఏడాదిన్నర వెయిట్ చేసి అనేక మంది దర్శకులను కాదని త్రివిక్రమ్ కి అవకాశం ఇచ్చాడు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా అద్భుతం చేసింది. రికార్డు కలెక్షన్స్ తో నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకుంది.
బన్నీ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించిన అల వైకుంఠపురంలో మేనియా బాలీవుడ్ వరకు పాకింది. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఈ చిత్రం అద్భుతం చేసింది. 29.4 టీఆర్పీ దక్కించుకున్న ఈ చిత్రం ఆల్ టైం హైయెస్ట్ టీఆర్పీ దక్కించుకున్న టాలీవుడ్ మూవీగా నిలిచింది. ఈ చిత్ర విజయంలో థమన్ సాంగ్స్ కీలక పాత్ర వహించాయి. చాలా కాలం తరువాత థమన్ కెరీర్ బెస్ట్ ఆల్బం ఇచ్చారు. మూవీలో ప్రతి పాట ఆటం బాంబ్ లా పేలాయి.
మూవీ విడుదలకు నెలల ముందు నుండే మేకర్స్ ఒక్కోపాట విడుదల చేస్తూ వచ్చారు. సామజవరగమనా సాంగ్ తో మొదలైన ప్రభంజనం బుట్టబొమ్మ వరకు కొనసాగింది. ఇక యు ట్యూబ్ లో ఈ సాంగ్స్ వందల మిలియన్ వ్యూస్ దక్కించుకున్నాయి. మొత్తంగా అల వైకుంఠపురంలో సాంగ్స్ 100 కోట్లకు పైగా వ్యూస్ రాబట్టి సౌత్ ఇండియాలోనే ఆ ఘనత సాధించిన మొదటి చిత్రంగా నిలిచింది. తాజాగా పాప్యులర్ మ్యూజిక్ యాప్ గానా నందు అల సాంగ్స్ 200 మిలియన్ స్ట్రీమ్స్ అందుకొని మరో రికార్డు సొంతం చేసుకుంది.
Most Recommended Video
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ 4 హైలెట్స్: బిగ్‌బాస్ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!