Allu Arjun: సోషల్ మీడియాలో తగ్గేదేలే అంటున్న బన్నీ!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిన్న మొన్నటి వరకు కేవలం దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు. ఈ క్రమంలోనే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉత్తరాది రాష్ట్రాలలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఇలా సినిమాల పరంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది ఫాలోవర్స్ దక్కించుకున్న హీరోలలో ఒకరిగా నిలబడ్డారు.

ఇప్పటివరకు అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా 15 మిలియన్ల మంది ఫాలోవర్స్ దక్కించుకొని రికార్డు సృష్టించగా తాజాగా తన రికార్డును తానే బద్దలు కొట్టారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా ఒక మిలియన్ ఫాలోవర్స్ ను పెంచుకొని ఏకంగా 16 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. ఇలా రోజురోజుకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతూ సోషల్ మీడియాలో కూడా ఏ మాత్రం తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నాడు.

సోషల్ మీడియాలో ఈయనకు రోజురోజుకు పెరుగుతున్న అభిమానం చూస్తుంటే త్వరలోనే 20 మిలియన్ల మార్కును దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ 1 ద్వారా ఇలాంటి క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ వచ్చే నెల నుంచి ఈ సినిమా సీక్వెల్ చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై కూడా ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటించగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి హాలిడే వెకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన దుబాయ్ వెళ్లగా ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus