Allu Arjun Dowry: స్నేహతో పెళ్లి.. బన్నీకి ఎంత కట్నం దక్కినట్టు..!

అల్లు అర్జున్- స్నేహ రెడ్డి టాలీవుడ్లో బెస్ట్ అండ్ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు. టాలీవుడ్లో ఉన్న అన్ని జంటల్లో కల్లా ఈ జంట చాలా ప్రత్యేకం. వీళ్ళ పిల్లలు అయాన్, అర్హ లు కూడా పాపులర్ అయిపోయారు. అల్లు స్నేహ వాళ్ళ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ బన్నీ అభిమానులను సర్ప్రైజ్ చేస్తుంటుంది. ఇక అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి లది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. 2011 లో వీరి వివాహం జరిగింది.

అయితే అంతకు ముందు నుండే వీళ్ళు ప్రేమలో ఉన్నారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు అల్లు అర్జున్. ‘సింగిల్ సిట్టింగ్ లో బన్నీ పెళ్లి మేటర్ తేల్చేసి ఫైనల్ చేసేసామని’ బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్‌ మామ, స్నేహరెడ్డి తండ్రి అయిన చంద్రశేఖర్‌ గారు ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ గురించి అలాగే బన్నీ కట్నం మేటర్ గురించి చెప్పుకొచ్చారు.

“అల్లుడిగా బన్నీకి వందకు వంద మార్కులు వేస్తాను. అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదగడం చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్రంలోనే కాకుండా బయట కూడా బన్నీకి ఎంతో మంది అభిమానులున్నారు. చిరంజీవి అడుగుజాడల్లో బన్నీ కూడా ఎంతో కష్టపడతారు” అంటూ చెప్పుకొచ్చిన చంద్రశేఖర్..

‘పెళ్లి టైములో బన్నీకి కట్నం ఏమీ ఇవ్వలేదు. వాళ్లకే ఎక్కువ ఉంది. మనం ఇచ్చేది వాళ్లకి లెక్క కూడా కాదు. కట్నాలకు వాళ్లు వ్యతిరేకం’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బన్నీ ఫ్యాన్స్ అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ టాపిక్ ను వైరల్ చేస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus