Allu Arjun: అభిమానుల దాడిపై స్పందించిన బన్నీ!

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ పుష్ప పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా అన్ని భాషల్లో వర్కౌట్ అవుతుందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉంది. అయితే సినిమా విడుదల తేదీకి ఎక్కువగా సమయం లేకపోయినప్పటికీ ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా మరెన్నో ప్రమోషన్లు మిగతా భాషల్లో అయితే స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక్కడే అన్ని రకాల ప్రమోషన్స్ చూసుకుంటున్నారు.

కానీ అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే భారీ స్థాయిలో సక్సెస్ అయ్యింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అల్లు అర్జున్ వేడుకలకు భారీ స్థాయిలో లక్షలాది మంది హాజరయ్యారు. అయితే ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కు ఊహించని అనుభవం ఏర్పడింది. అభిమానులను ప్రత్యేకంగా కలుసుకునేందుకు ఫ్యాన్ మీట్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు.

మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో ప్రత్యేకంగా కూడా ఇచ్చారు. అభిమానులు కూడా వారికి ఇచ్చిన పాస్ లను తీసుకుని రావాలని చెప్పార అయితే ఊహించని విధంగా అభిమానులు తాకిడి ఎక్కువ కావడంతో నిర్వాహకులు కంట్రోల్ చేయలేకపోయారు. అంతేకాకుండా పోలీసులు కూడా లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహంతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు ఆ సమయంలో అద్దాలు కూడా పగిలిపోవడంతో పలువురు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ విషయంపై బన్నీ కూడా ఎమోషనల్ గా స్పందించారు.

అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా ఈ స్పందించాడు. ఫ్యాన్స్ మీట్ ఈవెంట్‌లో నా అభిమానులు గాయలపాలవ్వడం నిజంగా దురదృష్టకర సంఘటన. ఆ విషయం గురించి నాకు తెలిసింది. మా టీమ్ సభ్యులు ఎప్పటికప్పుడు పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తోంది. ఇక నుంచి ఇలాంటి ఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటానని బన్నీ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అంతే కాకుండా మీ ప్రేమ మరియు అభిమానం నా అతిపెద్ద ఆస్తి.. అంటూ బన్నీ ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus