“నా పేరు సూర్య” అనంతరం అల్లు అర్జున్ ఆర్మీలో జాయినవుతానన్న విషయం నిజమే కానీ.. ఉన్నట్లుండి ఈ రాజకీయ ఆరంగేట్రం ఏంట్రా అనుకొంటున్నారా?. ఇంతకీ విషయం ఏంటంటే.. “నా పేరు సూర్య” అనంతరం కొంచెం గ్యాప్ తీసుకొన్న అల్లు అర్జున్ ఈసారి కమర్షియల్ ఎలిమెంట్స్ మీద మాత్రమే కాకుండా కంటెంట్ మీద కూడా కాన్సన్ ట్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే తన తాజా సినిమా కోసం కాస్త గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యి లుక్స్ పరంగా మాత్రమే కాక బాడీ పరంగానూ కొత్త మార్పుల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఎవరి దర్శకత్వంలోనన్న విషయంలో ఇంకా క్లారిటీ లేకపోవడంతో మార్కెట్ లో చాలా పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే.. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించనున్నాడన్నది మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు. ఈ సినిమాను విక్రమ్ కుమార్ ఓ పోలిటికల్ డ్రామాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవల వచ్చిన “భరత్ అనే నేను, రంగస్థలం” రెండూ రాజకీయ నేపధ్యంలో తెరకెక్కిన సినిమాలే కావడం, ఆ రెండిట్నీ జనాలు కూడా ఆదరించి ఉండడంతో బన్నీ కూడా ఆ వైపే అడుగులు వేస్తున్నాడు. మరి బన్నీ తీసుకోనున్న పోలిటికల్ టర్న్ అతడి కెరీర్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది తెలియాలి.