పాపం అల్లు అర్జున్ అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అనుకుంటున్నారా.. అసలే “నా పేరు సూర్య” మిక్స్డ్ రివ్యూస్ తో తెలుగు రాష్ట్రాల్లోనే నిలదొక్కుకోవడానికి నానా కష్టాలు పడుతున్న తరుణంలో బుధవారం విడుదలైన “మహానటి” పుణ్యమా అని ఓవర్సీస్ లోనూ కనీస స్థాయి కలెక్షన్స్ వసూలు చేయడానికి నానా కష్టాలూ పడుతోంది. ఇప్పటివరకూ కనీసం 600K కూడా దాటని “నా పేరు సూర్య” ఓవర్సీస్ కలెక్షన్స్ చూస్తుంటే.. ఓవర్సీస్ లో ఈ సినిమా కొన్నవాళ్ళు కాస్త టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా “మహానటి” ఓవర్సీస్ లో రచ్చ రచ్చ చేస్తుండడంతో ఇకపై సూర్య కి థియేటర్లు తగ్గించే పనిలో ఉన్నారు ఓవర్సీస్ థియేటర్స్ ఒనర్స్.
అల్లు అర్జున్ కెరీర్ లో ఓవర్సీస్ లో ఒన్ మిలియన్ డాలర్స్ వసూలు చేసిన సినిమాలు “సన్నాఫ్ సత్యమూర్తి, రేసు గుర్రం”. ఈ రెండు సినిమాల తర్వాత అల్లు అర్జున్ కి ఓవర్సీస్ లో కనీస స్థాయి కలెక్షన్స్ కూడా లేవు. ముఖ్యంగా “సరైనోడు, దువ్వాడ జగన్నాధం” లాంటి చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించినట్లుగా హడావుడి చేసినా.. ఓవర్సీస్ లో మాత్రం ఆ రెండు సినిమాలూ డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాస్ తెచ్చిపెట్టాయి. ఇప్పుడు “నా పేరు సూర్య” కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతుండడం పట్ల అల్లు అర్జున్ మాత్రమే కాదు అతని అభిమానులు కూడా బాధపడుతున్నారు. ఇదే విధంగా అల్లు అర్జున్ సినిమాల ట్రెండ్ ఇంకొన్నాళ్లపాటు కంటిన్యూ అయితే.. ఓవర్సీస్ లో అల్లు అర్జున్ సినిమాలు చూడడం మానేస్తారేమో జనాలు.