టాలీవుడ్ దాని దశ మార్చుకుంటుంది…ఒకప్పుడు కేవలం మన తెలుగు రాష్ట్రానికే పరిమితం అయిన మన సినిమాలు కొంతకాలానికి రాష్ట్రాలు దాటి అక్కడ సైతం మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నాయి. అదే క్రమంలో కొంత కాలంగా దేశం దాటి సైతం మన సినిమాలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. బడ్జెట్ పరంగా ఏ మాత్రం వెనుకా ముందు ఆలోచించకుండా మంచి నటీనటులతో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కిస్తున్న మనవాళ్ళు ప్రతీ చోట తమ ప్రాబల్యాన్ని చాటుకుంటున్నారు. తాజా సంగతే తీసుకుంటే ఎస్ ఎస్ రాజమౌళి ‘బాహుబలి’, బాహుబలి 2 చిత్రాలతో ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమను జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేశాడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు… ఇదిలా ఉంటే సినిమా పెద్ద సినిమా కావడం, నటీనటులు బడా ఆర్టిస్ట్స్ కావడం, భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కడం అన్నీ వెరసి సినిమాపై మీడియా పూర్తి ఫోకస్ పెట్టింది అనే చెప్పాలి…ఇంకో రకంగా చెప్పాలు అంటే సినిమా ఆధారంగానే ఎన్నో మీడియా సంస్థలు నడుస్తున్నాయి అని చెప్పక తప్పదు. ఇక ఇదిలా ఉంటే మీడియా సినిమాకి ఎంత సహకరిస్తుందో…అంటే ఇబ్బంది సైతం పెడుతుంది అన్న విషయం కాస్త ఆలోచించాల్సిందే…ఎందుకంటే…ప్రస్తుతం ఓ భారీ చిత్రం సెట్స్ పై కి వెళ్లినప్పటి నుంచి కలెక్షన్లు వచ్చే వరకు మీడియా, సోషల్ నెట్ వర్క్ ఎంతో సహకరిస్తున్నాయి.
కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాను ప్రేక్షకులు ఎంత వరకు చూడగలుగుతారు అన్న విషయం రివ్యూస్ రూపంలో దర్శనం ఇవ్వడం, అందులోనూ పెయిడ్ రివ్యూస్ ఎక్కువగా ఉండడం సినిమాను ఇబ్బంది పెడుతున్న సమస్య. తాజాగా మన స్టైలిష్ స్టార్ ఇదే విషయంపై చాలా సీరియస్ గా సీరియస్ గా ఉన్నాడని సమాచారం…దానికి కారణం ఏంటి అంటే…. ఆయన సినిమా డీజే దువ్వాడ జగన్నాథం సినిమా కు రివ్యూ లు సరిగా రాకపోవడమే. అమెరికా పర్యటన కు వెళితే అక్కడ కూడా ఇలాగే మీడియా వెంట పడటంతో సహనం కోల్పోతున్నాడు అల్లు అర్జున్. ఒక పక్క సినిమాకి రివ్యూస్ బాగానే వస్తున్నాయి అన్న టాక్ ఉంది…కానీ…బయ్యర్స్ నష్టపోయారు అన్న నిజం సైతం కాస్త వెంటాడుతుంది…మరి ఈ సినిమా ఎంతవరకూ వసూళ్లు రాబడుతుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.