Allu Arjun: ఫ్యాన్స్ డిమాండ్ బన్నీకి అర్థమవుతోందా?

అల వైకుంఠపురములో మూవీ సక్సెస్ బన్నీ కెరీర్ కు ప్లస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బన్నీ క్రేజ్ తో పాటు, మార్కెట్ ను కూడా పెంచింది. బన్నీ నటించిన పుష్ప పార్ట్1 మూవీ ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత బన్నీ నటించే సినిమా గురించి క్లారిటీ లేదు. ఆగష్టు 13వ తేదీన రిలీజ్ కావాల్సిన పుష్ప పార్ట్1 వేర్వేరు కారణాల వల్ల డిసెంబర్ నెలకు వాయిదా పడి త్వరలో రిలీజవుతుంది.

పుష్ప మూవీకి, ఆర్ఆర్ఆర్ మూవీకి మధ్య మూడు వారాల గ్యాప్ ఉండటంతో పుష్ప మూవీ భారీగా కలెక్షన్లు సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. పుష్ప మూవీకి హిట్ టాక్ వస్తే కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. బన్నీ తర్వాత సినిమా డైరెక్టర్ల జాబితాలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. అయితే ఏ డైరెక్టర్ డైరెక్షన్ లో బన్నీ నటిస్తారో క్లారిటీ రావాల్సి ఉంది. బన్నీ మాత్రం పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్లకు మాత్రమే ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు పుష్ప పార్ట్2 షూటింగ్ కు స్పందించి క్లారిటీ రావాల్సి ఉంది. అఖండతో సక్సెస్ సాధించిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటించాలా? వద్దా? అనే విషయంలో బన్నీ తేల్చుకోలేపోతున్నారని సమాచారం. బన్నీ మినహా మిగిలిన స్టార్ హీరోలంతా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బన్నీ తర్వాత సినిమా గురించి త్వరగా క్లారిటీ రావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తుండగా ఈ డిమాండ్ గురించి బన్నీ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus