పనిగట్టుకొని ప్రభాస్ పైకి పోటీకి వచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్..!

బన్నీ ఫ్యాన్స్ ఇవాళ సోషల్ మీడియాపై పడ్డారు. తమ హీరో పేరున ఓ యాష్ ట్యాగ్ భారీగా ట్రెండ్ చేస్తున్నారు. ఇండియన్ స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్ అంటూ ఓ యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇవాళ సంధర్భం కూడా ఏమీ లేదు కదా, వేళాపాళా లేకుండా వీరి ఉత్సాహానినికి కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం బయటపపడింది. నేడు ప్రభాస్ నటించిన సాహో మూవీ ఫస్ట్ యానివర్సరీ పూర్తి చేసుకుంది. గత ఏడాది ఆగస్టు 30న సాహో విడుదలై మిశ్రమ ఫలితాలు అందుకుంది.

బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రం ప్రభాస్ ఇమేజ్ మరో స్థాయికి తీసుకెళ్లింది. సాహో విడుదలై ఏడాది పూర్తయిన సంధర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ వేడుక జరుపుకుంటున్నారు. ట్విట్టర్ లో సాహో మరియు ప్రభాస్ పేరున యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. నేడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పనిగట్టుకొని ఆయన పేరుపై ఓ యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడానికి కారణం ఇదే అని తెలుస్తుంది. బాలీవుడ్ లో కూడా ఇమేజ్ తెచ్చుకొని, ఇండియన్ సూపర్ స్టార్ హోదాలో ఉన్న ప్రభాస్ కి పోటీ ఇవ్వాలనే వారు ఎంటర్ అయ్యారట.

ఫాలోయింగ్ లో అల్లు అర్జున్ ఎవరికీ తీసిపోవడని తెలియజెప్పాలని అనుకుంటున్నారట. అందుకే తమ హీరో పేరున ఓ యాష్ ట్యాగ్ భారీగా ట్రెండ్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచనగా తెలుస్తుంది. కొందరు దీనిని అత్యుత్సహం అంటున్నారు.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus