స్టార్ హీరో అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు ప్రభాస్ బాహుబలి మూవీకి చాలా పోలికలు ఉన్నాయి. రాజమౌళి మొదట బాహుబలి సినిమాను ఒక పార్ట్ గా మొదలుపెట్టి వేర్వేరు కారణాల వల్ల రెండు పార్టులుగా తెరకెక్కించారు. ఎవరూ ఊహించని ట్విస్ట్ తో బాహుబలి పార్ట్1 క్లైమాక్స్ ను ముగించడం ఆ సినిమాకు ప్లస్ అయింది.
పుష్ప సినిమా కూడా మొదట సింగిల్ పార్ట్ గా మొదలై వేర్వేరు కారణాల వల్ల రెండు భాగాలుగా మారింది. బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ సమయంలో సెకండ్ పార్ట్ కు సంబంధించిన ఫుటేజ్ సిద్ధంగా ఉండటంతో కొంత పెట్టుబడి డెఫిసిట్ గా ఆ సినిమా విడుదలైంది. ప్రస్తుతం పుష్ప సినిమా విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ బన్నీకి ప్రధానంగా మరో సమస్య కూడా ఉంది. పుష్ప భారీ బ్లాక్ బస్టర్ హిట్టైతే మాత్రమే రెండో పార్ట్ పై అంచనాలు భారీగా పెరుగుతాయి.
మొదటి పార్ట్ ఫలితాన్ని బట్టి రెండో పార్ట్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉంటాయి. పుష్ప విషయంలో బన్నీ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం మరికొన్ని సినిమాలు రెండు పార్టులుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. బాహుబలి, బాహుబలి2 సినిమాల్లో ప్రభాస్ గ్యాప్ తీసుకోకుండా నటించగా బన్నీ మాత్రం పుష్ప పార్ట్1 తర్వాత ఐకాన్ సినిమాలో నటించి పుష్ప2 షూటింగ్ లో పాల్గొననున్నారు. సుకుమార్ ఈ సినిమాతో రంగస్థలంను మించిన హిట్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.