Allu Arjun, Shraddha Das: ‘పుష్ప’ స్టేప్పేసిన నాయికను బన్నీ భలే రిప్లై!

‘పుష్ప’లో ఐటెమ్‌ సాంగ్‌ రిలీజ్‌ అయిన తర్వాత ఎవరిని కదిపినా ‘ఉ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటున్నారు. అంతగా హైలైట్‌ అయిపోయింది ఆ పాట. కొత్త భామలు, కొంతమంది సీనియర్‌ భామలు సమంతలా మారిపోయి, స్టెప్పులేసేస్తున్నారు. అలా శ్రద్ధా దాస్‌ కూడా ‘ఉ అంటావా..’ అంటూ ఇటీవల నడమును ఓ ఊపు ఊపేసింది. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తే, అది వైరల్‌ అవుతోంది. తాజాగా ఆ వీడియోకు అల్లు అర్జున్‌ ఇచ్చిన రిప్లై ఇంకా అదిరిపోయింది.

కెరీర్‌లో తొలిసారి సమంత ‘పుష్ప’ సినిమా కోసం ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ‘ఉ అంటావా… ఊ ఊ అంటావా…’ అంటూ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకత్వంలో ఇంద్రావతి చౌహాన్‌ పాడిన పాట అది. ఐటెమ్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అంటూ ఆ పాటను అందరూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఫుల్‌ మాస్ బీట్‌కి, సమంత్‌ హాట్‌ స్టెప్పులు అదుర్స్‌ అని చెప్పాలి. అందుకే అంతగా వైరల్‌ అవుతోంది. ఇప్పటికీ యూట్యూబ్‌ మ్యూజిక్‌లో ట్రెండింగ్‌లోనే ఉంది. ఆ పాట బిట్‌కే శ్రద్ధ స్టెప్పులేసింది.

మిత్రుడితో కలసి కారు పార్కింగ్‌ ఏరియాలో ‘ఉ అంటావా’ హుక్‌ స్టెప్‌ వేసి ఆ వీడియోను పోస్ట్‌ చేసింది. దాని భారీగా లైక్‌లు, వ్యూస్‌ వస్తున్నాయి. ఆ వీడియో చూసి అల్లు అర్జున్‌ ‘హెల్యూజినేషనల్‌లో ఇది 100వ స్టేజ్‌’ అంటూ కామెంట్‌ పెట్టాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య 2’లో ఈ డైలాగ్‌ బాగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో బన్నీ ఉరఫ్‌ ఆర్య, శ్రద్ధ ఒకే కంపెనీలో పని చేస్తుంటారు. ఈ క్రమంలో ఆర్యను శ్రద్ధ ఇష్టపడుతూ ఉంటుంది.

దానికి ఆ కంపెనీ హెచ్‌ఆర్‌ అయిన బ్రహ్మానందం హెల్యూజినేషన్‌తో పోలుస్తాడు. ఓ సందర్భంలో అందులో స్టేజెస్‌ గురించి మాట్లాడతాడు కూడా. ఆ డైలాగ్‌నే ఇప్పుడు అల్లు అర్జున్‌ ఈ వీడియో కోసం వాడేశాడు. ఏదేమైనా శ్రద్ధ స్టెప్‌ అదిరింది, బన్నీ కామెంట్‌ కూడా అదిరింది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus