ఈమధ్య సినిమాలకి సంబంధించిన వివరాలు, హీరోహీరోయిన్ల లుక్స్ షూటింగ్ టైమ్ లోనే బయటకొచ్చేస్తున్నాయి. నిజానికి దానివల్ల పెద్దగా నష్టం లేకపోయినా.. సినిమాపై ఇంట్రెస్ట్, క్రేజ్ లాంటివి తగ్గిపోతాయని సదరు సినిమా టీం బాధ. అందుకే కొన్ని పెద్ద సినిమాల ప్రొడక్షన్ టీమ్స్ సెల్ ఫోన్స్ ను సెట్స్ లోకి తీసుకురానివ్వరు. అయితే.. ఇప్పటివరకూ ఈ సీక్రెట్ షూటింగ్ పద్ధితిని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యింది కేవలం “బాహుబలి” టీం మాత్రమే. అందుకే సినిమాకి సంబంధించి.. సినిమా యూనిట్ విడుదల చేసిన స్టిల్స్ పోస్టర్స్ తప్ప మరో ఫోటో ఇంటర్నెట్ లో కనిపించలేదు. “రోబో 2” కూడా సేమ్ ప్రొసీజర్ ను ఫాలో అయినప్పటికీ.. అక్షయ్ కుమార్ లుక్ బయటకి వచ్చేసింది.
బయటివాళ్లు ఫోటోలు తీయకపోయినా.. సెట్ లో ఉన్నవాళ్లెవరైనా సరే సెల్ఫీలు తీసుకోవడం, ఫేస్ బుక్, ట్విట్టర్ లో పోస్ట్ చేయడం వల్ల సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాలు బయటకి వచ్చేస్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా.. తమ సినిమాకి సంబంధించిన ఎటువంటి వివరాలు బయటకి రాకూడదని “ఫోటోలతోపాటు సెల్ఫీలు కూడా తీసుకోవడం కుదరదు” అంటూ “నా పేరు సూర్య” టీం పెద్ద బోర్డ్ తయారు చేయించి మరీ సెట్స్ లో పెట్టించారు. మరి ఈ బోర్డ్ వల్ల ఎంత ఉపయోగం ఉందో త్వరలో తెలుస్తుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.