టాలీవుడ్ స్టైలిష్ స్టార్ ఇటీవల ఐకాన్ స్టార్ గా కొత్త ట్యాగ్ అందుకున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాతో ఎలాగైనా బాహుబలి అంత కాకపోయినా ఓ రేంజ్ లో హిట్టు కొట్టాలని గట్టిగానే ప్లాన్ వేశారు. రెండు భాగాలుగా రాబోతోంది అనగానే సినిమా బిజినెస్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఇటీవల బన్నీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేకులు వేసిన విషయం తెలిసిందే. రెండు వారాలుగా ఐసోలేషన్ లోనే ఉన్న బన్నీ కోవిడ్ 19 నెగిటివ్ రాగానే మొదట పిల్లల్ని కలుసుకున్నారు.
అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం బన్నీ తన స్టాఫ్ లో ఉన్న వాళ్ళకు అలాగే వారి ఇంట్లో వాళ్ళకే వ్యాక్సినేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. 45ఏళ్ళకు పైగా ఉన్న వారి కోసం సొంత ఖర్చులతో వ్యాక్సిన్ వెయిస్తున్నారు. అలాగే తన దగ్గరలో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్ పంపినట్లు తెలుస్తోంది.
వీలైనంత మందికి తనకు తోచినంత సహాయం చేసేందుకు బన్నీ ఆలోచిస్తున్నాడు. ఇక ఇటీవల మహేష్ బాబు తన సొంత గ్రామం బుర్రిపాలెం అలాగే దత్తత తీసుకున్న సిద్ధాపురం గ్రామ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ వేయించేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!