ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన కెరీర్ లోనే అద్భుతమైన ఘనతను “పుష్ప 2″తో (Pushpa 2: The Rule) సాధించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ప్రస్తుతం ఈ సినిమా దాదాపు 1600 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించనున్నట్లు ట్రేడ్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో, “పుష్ప 3” గురించి వచ్చిన గాసిప్స్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది.
Allu Arjun
“జులాయి,” (Julayi) “సన్నాఫ్ సత్యమూర్తి,” (S/O Satyamurthy) “అల వైకుంఠపురంలో” (Ala Vaikunthapurramuloo) వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన ఈ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ను వెనక్కి నెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం “పుష్ప” (Pushpa) సిరీస్ మీదే దృష్టి పెట్టిన బన్నీ, త్రివిక్రమ్ సినిమాను ఆలస్యంగా చేయాలని నిర్ణయించినట్లు టాక్. “పుష్ప 3″ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బన్నీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
సుకుమార్ (Sukumar) తన తదుపరి ప్రాజెక్ట్‌ను రామ్ చరణ్‌తో చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్ళడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ గ్యాప్‌లో “పుష్ప 3″ని పూర్తి చేస్తే, ఆడిషనల్ మార్కెట్‌ను టాప్ చేయడమే కాకుండా, మరో భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంటుందని బన్నీ భావిస్తున్నారట. “పుష్ప 3″ను త్వరగా పూర్తి చేయడం కోసం సుకుమార్ కూడా తన స్క్రిప్ట్ పనులను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం.
“పుష్ప 2″లో ఉన్న క్లిఫ్ హ్యాంగర్ ఎండ్, పార్ట్ 3పై ఆసక్తిని పెంచింది. ఇది “పుష్ప 3″ని మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టేలా చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ ఆలస్యం అయినప్పటికీ, దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇంకా పూర్తికాకపోవడం కూడా దీనికి కారణం కావచ్చు. “పుష్ప 3” తర్వాత బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌పై పూర్తి ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో, త్రివిక్రమ్ కథ ఎంత ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.