ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అవార్డు రావడంతో సీక్వెల్స్ సినిమాపై మరింత ఫోకస్ పెట్టారు. పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ నటనకు అభిమానులందరూ కూడా ఫిదా అయ్యారు.
దీంతో సీక్వెల్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి ఆ అంచనాలకు అనుగుణంగానే మేకర్స్ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. సాధారణంగా సినిమా షూటింగ్ జరుగుతుంది అంటే అక్కడికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటారు ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలు వీడియోలు బయటకు లీక్ అవుతూ ఉంటాయి.
తాజాగా పుష్ప 2 షూటింగ్ లోకేషన్ నుంచి అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో అల్లు అర్జున్ చీర కట్టుకొని కూర్చొని ఉన్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది. తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలతో పుష్ప 2 సినిమాలో కొన్ని సీన్స్ ఉండనున్నాయి.
ఆల్రెడీ ఆ జాతరకు రెడీ అయ్యేలాగా గతంలోనే అల్లు అర్జున్ కి చీర కట్టి అమ్మవారిలా ఉన్న పోస్టర్ కూడా విడుదల చేశారు.ప్రస్తుతం అదే చీరలో ఉన్నటువంటి ఫోటో వైరల్ గా మారడంతో బహుశా జాతరకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇలా చీర కట్టులో (Allu Arjun) అల్లు అర్జున్ ఫోటో లీక్ అవడంతో ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.