స్టార్ డైరెక్టర్ సుకుమార్ నెమ్మదిగా సినిమాలను తెరకెక్కిస్తారని ఇండస్ట్రీలో పేరుంది. ఈ రీజన్ వల్లే 17 సంవత్సరాల సినీ కెరీర్ లో సుకుమార్ తక్కువ సంఖ్యలోనే సినిమాలను తెరకెక్కించారు. పుష్ప ది రైజ్ సినిమా షూటింగ్ కూడా అంతకంతకూ ఆలస్యమై గతేడాది డిసెంబర్ 17వ తేదీన రిలీజైంది. పుష్ప ది రైజ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరగడంతో ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం కేటాయించి ఉంటే పుష్ప ది రైజ్ క్వాలిటీ విషయంలో మరింత ఆకట్టుకుని ఉండేదని అభిప్రాయాలు వినిపించాయి. పుష్ప ది రైజ్ సక్సెస్ తో జోరుమీదున్న అల్లు అర్జున్ ఈ ఏడాదే పుష్ప ది రూల్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. సుకుమార్ కు ఇప్పటికే పుష్ప ది రూల్ కు సంబంధించి బన్నీ కీలక సూచనలు చేశారని సమాచారం అందుతోంది. పుష్ప ది రైజ్ విషయంలో చేసిన తప్పు పుష్ప ది రూల్ విషయంలో చేయవద్దని బన్నీ సుకుమార్ కు సూచించారని తెలుస్తోంది.
పుష్ప ది రూల్ షూటింగ్ ను వీలైనంత వేగంగా పూర్తి చేసి ప్రచార కార్యక్రమాలకు తగినంత సమయం కేటాయించాలని బన్నీ సుకుమార్ కు చెప్పినట్టు సమాచారం అందుతోంది. సుకుమార్ సైతం సమయం వృథా కాకుండా ఈ సినిమాను తెరకెక్కించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. పుష్ప ది రైజ్ కు ప్రమోషన్స్ బాగా చేసి ఉంటే ఈ సినిమాకు మరింత ఎక్కువగా కలెక్షన్లు వచ్చి ఉండేవి. పుష్ప ది రూల్ లో కొత్తగా మూడు పాత్రల ఎంట్రీ ఉంటుందని విదేశాల్లో కూడా పుష్ప ది రూల్ షూటింగ్ ను జరపనున్నారని సమాచారం అందుతోంది.
పుష్ప ది రూల్ కూడా అంచనాలకు మించి విజయం సాధిస్తుందేమో చూడాల్సి ఉంది. దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.