గంగోత్రి సినిమా నుండి అల్లు అర్జున్ ని ప్రాణం కంటే ఎక్కువుగా అభిమానిస్తున్న అభిమాని నాగేశ్వరావు తన స్వగ్రామం మాచర్ల గ్రామం కమ్మం పాడు నుండి నడిచి హైదరాబాద్ నడుస్తూ వస్తున్నాడని తన టీం ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే తనని ఆపి హైదరాబాద్ కి తీసుకురమ్మని చెప్పారు. అప్పటి నుండి అల్లు అర్జున్ టీం అంతా అతని కాంటాక్ట్ కొసం ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. కాని అతని ఆచూకి దొరకలేదు. చివరకి 6 రోజుల తరువాత హైదరాబాద్ చేరుకున్న నాగేశ్వరావుని అల్లు అర్జున్ టీం కలిసి నిన్న సాయంత్రం అల్లు అర్జున్ కి కలిపించడం జరిగింది. అల్లు అర్జున్ నాగేశ్వరావుని కలిసి యెగక్షేమాలు కనుక్కున్నారు.
రొజుకు 35 కిలోమీటర్ల నుండి 40 కిలొమీటర్లు నడిచాను.. అది కూడా చెప్పులతో నడిచాను అని చెప్పగానే ఒక్క క్షణం అల్లు అర్జున్ కల్లు చెమర్చాయి. ఎందుకు ఇలా చేశావు.. ఈరోజు కాకపోతే రేపు అభిమానుల్ని కలుస్తాను కదా ఇలా చేయటం వలన మీ ఆరోగ్యం ఏమయినా అయితే నేను ఎలా హ్యపిగా వుంటాను అని అడిగాడు.. దానికి నాగేశ్వారావు మాట్లాడుతూ.. 15 సంవత్సరాల నుండి మీకు నేను పెద్ద ఫ్యాన్ ని మీ అన్ని ఫంక్షన్స్ కి వచ్చాను. మిమ్మల్ని కలవటమే ద్యేయం గా అప్పటికప్పుడు అనుకుని మా ఊరి నుండి మెదలయ్యాను అన్నారు. దానకి అల్లు అర్జున్ స్పందిస్తూ.. మాస్క్ వేసకుని వచ్చావు బాగుంది .. దారిలో గుళ్ళో పడుకున్నానని చెప్తున్నావు.
చాలా కష్టపడి వచ్చావు బాగుంది నా మీద నీకున్న అభిమానానికి చాలా హ్యపి గా వుంది కాని ఇలా నడిచి రావటం చాలా భాద గా వుంది. ఇలాంటివి మీ భవిష్యత్తు కొసమో మీ ఫ్యామిలి కొసమో చేస్తే అప్పుడు నెను చాలా గర్వం గా చెప్పుకుంటాను. దయచేసి మరొక్కసారి ఇలా చెయ్యాలి అనుకుంటే మాత్రం నీకొసం, నీ ఫ్యామిలి కొసం చెయ్యి అంటూ తన అభిమానికి అల్లు అర్జున్ గుర్తుగా మోక్కని ని గిఫ్ట్ గా ఇచ్చారు. అంతే కాదు తనకి AA మాస్క్ లు కూడా ఇచ్చారు. తనకి వీలున్నప్పుడల్లా అభిమానుల్ని కలిసే ప్రయత్నం చేస్తాను కాని ఇలా చేయటం మంచిది కాదు మీ ఎఫర్ట్ అంతా మీ భవిష్యత్తు కొసం పెట్టండి అనేది నా మాట అని అభిమానిని క్షేమంగా పంపించారు.