ఒక్కోసారి పరాజయంకంటే ఎక్కువగా విజయం మనల్ని ఇబ్బందిపెడుతుంది. ఇప్పుడు త్రివిక్రమ్ పరిస్థితే అందుకు నిదర్శనం. “అజ్ణాతవాసి” ఫ్లాప్ అయినప్పుడు ఆయన వద్దకు వెళ్ళిన నిర్మాతలు లేరు, ఇప్పుడు “అరవింద సమేత” సక్సెస్ అయ్యేసరికి ఆయన చుట్టూ నిర్మాతలు క్యూకట్టారు. అయితే.. త్రివిక్రమ్ ఎప్పుడూ వాళ్ళను పెద్దగా పట్టించుకోలేదనుకోండి. కానీ.. ఈసారి మాత్రం త్రివిక్రమ్ కి తిప్పలు తప్పేలా లేవు. ఎందుకంటే.. ఆయన గత అయిదారేళ్లుగా ఒకే సంస్థలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. భవిష్యత్ లో కూడా అలానే చేయాలనుకున్నాడు. కానీ.. ఆయన తాజాగా అల్లు అర్జున్ తో తీయబోయే సినిమా విషయంలో మాత్రం మరో నిర్మాణ సంస్థ ఇన్వాల్వ్ మెంట్ తప్పేలా లేదు. అందుకు కారణాలు బోలెడున్నా.. గీతా ఆర్ట్స్ లేదా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు హారికా & హాసిని సంస్థతో కలిసి అల్లు అర్జున్ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
బాలీవుడ్ కామెడీ ఫిలిమ్ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుందని కథనాలు వెలువడినప్పటికీ.. త్రివిక్రమ్ సొంత కథతోనే అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని టాక్. అల్లు అర్జున్ కూడా అందుకే.. తన తదుపరి చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సిన విక్రమ్ కుమార్ కు కొన్నాళ్లు ఆగమని చెప్పేశాడట. అసలే “నా పేరు సూర్య” డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమాపై అల్లు అర్జున్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు.