టాలీవుడ్ స్టార్స్ సినిమాలు, యాడ్లతో పాటు హోటల్, థియేటర్ బిజినెస్‌లోకి అడుగు పెడుతున్నారు. సినిమాల్లో సంపాదించింది మిగతా రంగాల్లో పెట్టుబడిగా పెడుతూ వ్యాపార వేత్తలుగానూ రాణిస్తున్నారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి AMB సినిమాస్, భార్య నమ్రత పేరు మీద హోటల్ బిజినెస్ ప్రారంభించారు. ఏషియన్ సంస్థ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో లగ్జీరియస్ హోటల్స్ స్థాపించి, సక్సెస్ అయితే థియేటర్ బిజినెస్ మాదిరిగానే ఇండియా అంతటా తమ హోటల్స్‌ని విస్తరింపజెయ్యాలనే ప్లాన్‌లో ఉన్నారు..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ వాళ్లతో కలిసి మహబూబ్ నగర్‌లో ఏవీడీ సినిమాస్ స్థాపించిన సంగతి తెలిసిందే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే.. మల్టీప్లెక్స్, నిర్మాణ రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏ ఏ ఏ సినిమాస్ (ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్) స్థాపిస్తున్నాడు. అమీర్ పేట్ సత్యం థియేటర్‌ని పడగొట్టి.. అదే ప్లేసులో చాలా రోజుల క్రితమే శంకుస్థాపన చేశారు.
ఆధునిక హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో అద్భుతంగా తీర్చి దిద్దిన ఏషియన్ సత్యం మాల్ & మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తయింది.. జనవరిలో ప్రారంభించనున్నారని సమాచారం.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌కి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.. ‘పుష్ప’ రష్యా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ కోసం అక్కడికెళ్లిన టీం ఎలాంటి సందడి చేశారో చూశాం..పాండమిక్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ‘పుష్ప’ క్రియేట్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు..
2021లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ‘తగ్గేదే లే’ అంటూ ‘పుష్ప’ రాజ్‌గా బన్నీ సందడి చేసి ఏడాది కావస్తున్నాఇంకా ఫైర్ మాత్రం తగ్గలేదు.. నార్త్‌లోనూ ‘ఐకాన్ స్టార్’ కి బాగా క్రేజ్ వచ్చింది.. ఈ ఏడాది సీఎన్ఎన్ – న్యూస్ 18 ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డ్ అందుకున్నాడు అల్లు అర్జున్..
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!