హీరోలకు విజయం వచ్చినప్పుడు పెద్దగా ఆలోచించకుండా సినిమాని ఒకే చేయవచ్చు. ఎందుకంటే హిట్ ఊపులో కొంచెం బాగున్నా సినిమా ఆడేస్తది. అదే ఫ్లాప్ తర్వాత మాత్రం అలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొంచెం బాగాలేకపోయినా ఆడియన్స్ పక్కన పెట్టే ప్రమాదం ఉంది. అందుకే ప్రస్తుతం అల్లు అర్జున్ ఆలోచనలో ఉన్నారు. అతను చేసిన దువ్వాడ జగన్నాథం ఫరవాలేదనిపించినా… వక్కంతం వంశీ దర్శకత్వంలో చేసిన నా పేరు సూర్య మాత్రం బాగా దెబ్బకొట్టింది. దీంతో కొత్త డైరక్టర్స్ అంటే భయపడుతున్నారు. పోనీ స్టార్ డైరక్టర్స్ తో చేద్దామంటే ఎవరూ ఖాళీగా లేరు. అందుకే ఇదివరకు తనకు కథలు చెప్పిన దర్శకులతోనే తిప్పలు పడ్తున్నారు. సరైనోడు చిత్రం తర్వాత అనేక కథలు విన్న అల్లు అర్జున్ తమిళ డైరక్టర్ లింగుస్వామి చెప్పిన స్టోరీకి ఒకే చెప్పారు.
ఆ కథతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టాలని అనుకున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మాత జ్ఞాన్వేల్ రాజా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషల్లో నిర్మించడానికి ముందుకు వచ్చారు. అప్పుడు బన్నీ కథలో మార్పులు చేయమని సూచించారు. అదింకా కొలిక్కి రాలేదని సమాచారం. అలాగే విక్రమ్ కె కుమార్ కూడా బన్నీ కి ఓ కథ చెప్పారంట. అందులో సెకండాఫ్ బాగాలేదని చెప్పడంతో రీరైట్ చేసే పనిలో డైరక్టర్ ఉన్నారు. ఇక సరైనోడు సమయంలోనే బోయపాటి బన్నీకి మరో సినిమా చేస్తారని చెప్పారంట. కానీ ప్రస్తుతం రామ్ చరణ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్ కావడానికి మరో మూడు నెలలలు పడుతుంది. అప్పటి వరకు అల్లు అర్జున్ ఆగుతాడా? వేరే డైరక్టెర్ తో సినిమా మొదలు పెడుతారా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.