భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకోనున్న అల్లు అర్జున్ సినిమా
- May 11, 2017 / 09:22 AM ISTByFilmy Focus
తెలుగు హీరోలు ఇతర భాషల్లోనూ క్రేజ్ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే ఇతర రాష్ట్రాలతో పాటు దేశాల్లోనూ జెండా పాతేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ మూవీతో కోలీవుడ్ లో అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు. వీరి బాటలోనే అల్లు అర్జున్ నడుస్తున్నారు. తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని బన్నీ తమిళ డైరక్టర్ లింగు స్వామితో సినిమాకి ఒకే చెప్పారు. కానీ ఇప్పుడు అతన్నే పక్కన పెట్టారని తెలిసింది. లింగు స్వామి చిత్రానికి కోలీవుడ్ లో మాత్రమే క్రేజ్ ఉంటుందని ఇతర భాషల్లో క్రేజ్ ఉండదని గ్రహించిన బన్నీ ప్లాన్ చేంజ్ చేశారు. మనం, 24 సినిమాలతో విక్రమ్ కుమార్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బాగా పాపులర్ అయ్యారు.
ఓవర్ సీస్ లో అతని సినిమాకి మంచి మార్కెట్ ఉంది. అందుకే అతనితో ద్విభాషా చిత్రం చేస్తే సులువుగా ఇతర ఇండస్ట్రీలో దూసుకు పోవచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు విక్రమ్ కుమార్ అఖిల్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం బన్నీ హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం చేస్తున్నారు. ఇది పూర్తి కావచ్చింది. ఆ తర్వాత వక్కంతు వంశీ తో నాపేరు సూర్య, నా ఊరు ఇండియా మూవీ చేయనున్నారు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ తో సినిమా చేయాలనీ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కేలా ప్లాన్ చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















