సహజంగా బడా హీరోల దగ్గరకు చాలా కధలు వస్తూ ఉంటాయి. అయితే వాటిల్లో కొన్ని నచ్చక పోవడం వల్ల హీరోలు నో చెబుతూ ఉంటారు. అదే క్రమంలో ఆ సినిమా తెరపై వేరే హీరో చేసి హిట్ అయ్యినప్పుడు మాత్రం కాస్త ఫీల్ అవుతూ ఉంటారు. తాజాగా ఎన్టీఆర్ మిస్ అయ్యీ ఫీల్ అయిన సంధర్భాలు చూశాము. ఇక ఇప్పుడు బన్నీ వంతు, మెగా హీరోగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన బన్నీ, తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకుని వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు.
ఇదిలా ఉంటే సినిమా కధల ఎంపిక విషయంలో బన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాడు అని ఆ నాలుగు సినిమాల విషయంలో తేలింది.. ఇంతకీ ఏంటి ఆ నాలుగు సినిమాల వ్యవహారం అంటే…రీసెంట్ గా వచ్చిన ఒక అమ్మాయి తప్ప సినిమా అసలు ముందు బన్నికి చెప్పాడట దర్శకుడు రాజ సింహ అయితే కధలో పెద్ద స్టఫ్ లేకపోవడంతో నో చెప్పాడు బన్నీ…కట్ చేస్తే సినిమా ఫ్లాప్…ఈ ఏడాది విడుదలయిన సునీల్ కృష్ణాష్టమిని చేయాలని పట్టు పట్టాడట నిర్మాత దిల్ తాజూ, బట్ బన్నీ నో చెప్పాడు, కట్ చేస్తే సినిమా డిజాస్టర్, అదే క్రమంలో గుండెజారి గళ్లంతయ్యిందే సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు విజయ్ కుమార్ కొండా నాగ చైతన్యతో తీసిన ఒక లైలా కోసం ముందు అల్లు అర్జున్ కు చెప్పాడట. కాని సబ్జెక్ట్ నచ్చక నో చెప్పేసాడు.
సినిమా ఫ్లాప్ అయితే కాలేదు కానీ పెద్దగా హిట్ మాత్రం అవలేదు. ఇక దేవకట్ట సంధించిన “ఆటోనగర్ సూర్య” లాంటి మాస్ ఎలిమెంట్ ను సైతం బన్నీ నో చెప్పగా…సినిమా చివరకు ఫ్లాప్ గానే మిగిలింది. మొత్తానికి బన్నీ ఒకరకంగా లక్కీనే.