Allu Arjun: బాలీవుడ్ విషయంలో బన్నీ ఐడియా ఇదేనా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ బన్నీ నటిస్తున్న పుష్ప పార్ట్1 హిందీలో థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. బన్నీ ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు. రాజమౌళి సపోర్ట్ లేకుండానే పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవాలని బన్నీ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే బన్నీ బాలీవుడ్ హీరోతో కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటించాలని ప్లాన్ చేస్తున్నారని బోగట్టా.

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతుంది. జెర్సీ హిందీ ట్రైలర్ లాంఛ్ కు అల్లు అరవింద్ హాజరు కాగా మీడియా నుంచి అల్లు అరవింద్ కు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారా? అనే ప్రశ్న ఎదురైంది. అల్లు అరవింద్ స్పందిస్తూ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే సమయం ఇది కాదని అన్నారు. అల్లు అరవింద్ డైరెక్ట్ గా సమాధానం చెప్పకపోవడంతో బన్నీ, షాహిద్ కపూర్ హీరోలుగా మల్టీస్టారర్ తెరకెక్కనుందనే ప్రచారం మొదలైంది.

ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. డిసెంబర్ 17వ తేదీన పుష్ప పార్ట్1 రిలీజ్ కానుండగా రష్మిక, ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పుష్ప పార్ట్1 రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం. ఈ సినిమా రిలీజ్ డేట్ మారనుందని వార్తలు వస్తున్నా ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus