పుష్ప సాంగ్ లీక్: కావాలని లీక్ చేశారా… సహజంగానే జరిగిందా..?

అల్లు అర్జున్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్ పుష్ప సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్ తాలుకా బీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ట్విట్టర్ సాక్షిగా ట్యాగ్ అవుతూ ఈ ఆరు నిమిషాల వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం పుష్పకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలని అడవుల్లో షూట్ చేస్తున్నారు. ఇక్కడే బన్నీ పరిచయ పాటని చిత్రీకరిస్తోంది మూవీ టీమ్. దీనికి సంబంధించిన షూటింగ్ వీడియో ఒకటి బయటకి లీక్ అయ్యింది. దూరం నుంచి ఎవరో చెట్లచాటుగా ఈ వీడియోని షూట్ చేశారు.

ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ట్విట్టర్లో ఈ ఆరు నిమిషాల వీడియో హల్ చల్ చేస్తోంది. అప్పట్లో సుకుమార్ బన్నీ కాంబోలో వచ్చిన ఆర్య 2 సినిమాలో ఉప్పెనంత ఈ ప్రేమకి సాంగ్ కూడా ఇలాగే లీక్ అయ్యింది. మరి ఆ సెంటిమెంట్ ప్రకారం యూనిట్ లో సభ్యులే కావాలని లీక్ చేశారా.. లేదా షూటింగ్ చూడటానికి వచ్చినవాళ్లలో ఎవరైనా దీన్ని షూట్ చేశారా అనేది అనుమానంగా ఉంది.

ఇక అల్లు అర్జున్ మాస్ ఇంట్రడక్షన్ సాంగ్ కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీట్స్ ఈ వీడియోలో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు, ఇందులో బన్నీతో కలిసి రష్మిక కూడా చిందులేస్తోంది. ఇప్పుడు ఈ వీడియో లీక్ పై ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఇలా పెట్టిన పోస్ట్ లని డిలీట్ చేయమంటూ సదరు ఎకౌంట్ హోల్డర్స్ కి వార్నింగ్స్ ఇస్తున్నారు. మొత్తానికి పుష్ప సాంగ్ సోషల్ మీడియాలో ఈరోజు ఫుల్ హడావుడి చేస్తోంది.

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus