Allu Arjun: మా ఫౌండేషన్ ఆయనే.. వైరల్ అవుతున్న బన్నీ పోస్ట్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పేరు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది. ఈయన పుష్ప సినిమా ద్వారా సౌత్ టు నార్త్ విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం వివిధ రకాల యాడ్స్ ద్వారా కూడా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఇదిలా ఉండగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.ఈ క్రమంలోని తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా తన తాతయ్య అల్లు రామలింగయ్య ఫోటోని షేర్ చేస్తూ ఆ ఫోటో కింద మా ఫౌండేషన్ అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోని అభిమానులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.

ఈ విధంగా అల్లు అర్జున్ తన తాతయ్య ఫోటోని షేర్ చేస్తూ మా ఫౌండేషన్ అని క్యాప్షన్ జోడించడంతో యాంటీ ఫ్యాన్స్ సైతం పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే గతంలో అల్లు అర్జున్ తాను ఇండస్ట్రీలోకి రావడానికి స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి అని ఆయన మహావృక్షం అయితే ఆయన నీడలో పెరిగిన వారమంటూ చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్స్ షేర్ చేస్తూ దారుణంగా అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తున్నారు.

మొదటినుంచి చిరంజీవి వల్లే ఇండస్ట్రీలోకి వచ్చామని చెప్పుకొచ్చిన అల్లు అర్జున్ ఇలా ఉన్నఫలంగా మాట మారుస్తూ మా ఫౌండేషన్ అంటూ తన తాత ఫోటో షేర్ చేయడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ చేసిన ఈ పోస్టు వల్ల పెద్ద ఎత్తున ఈయన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే పుష్ప సినిమాతో మంచి హిట్ అందుకున్న అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2 సినిమాతో బిజీ కానున్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus