ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా, టాలెంట్ లేనిదే స్టార్ గా ఎదగడం చాలా కష్టం. అలా కష్టపడి స్టార్ హోదా సంపాదించిన హీరో అల్లు అర్జున్. తన మెస్మరైజింగ్ డాన్సులతో పక్క రాష్ట్రలలో కూడా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న బన్నీ తన ఫోకస్ బాలీవుడ్ పైన పెట్టారు. అందుకే అల వైకుంఠపురంలో భారీ సక్సెస్ తరువాత పుష్ప మూవీని పాన్ ఇండియా చిత్రంగా మార్చారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా చిత్రంగా చేయాలన్న ఆలోచన మొదటలేదు.
ఒక వేళ అలవైకుంఠపురంలో మూవీ సరైన విజయం సాధించకపోతే బన్నీ, సుకుమార్ ఈ ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేవారు కాదు. అల వైకుంఠపురంలో మూవీ బన్నీ ఇమేజ్ మరో స్థాయికి తీసుకెళ్లగా ఆయన బాలీవుడ్ లో రాణించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. దీని కోసం అభిప్రాయాలు, పాత స్వరాలు కూడా మార్చేశాడు అనిపిస్తుంది. ఓ నేషనల్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన దృష్టిలో బెస్ట్ డాన్సర్ ఎవరని చెవితే బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా పేరు చెప్పారు. అలాగే మీకు స్ఫూర్తి నిచ్చే నటుడు ఎవరంటే అమితాబ్ పేరు చెప్పారు.
ఈ రెండు సమాధానాలలో తన మామ చిరంజీవి పేరు లేకపోవడం గమనార్హం. గతంలో అనేక వేదికలపై చిరంజీవి డాన్సులను, నటనను వీర లెవల్లో పొగిడిన అల్లు అర్జున్ జాతీయ స్థాయి మీడియాలో మాత్రం బాలీవుడ్ హీరోల పేర్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు. బాలీవుడ్ లో ఎదగాలనుకుంటున్న బన్నీ అక్కడి ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడాని తెలివిగా ఈ సమాధానాలు చెప్పి ఉంటారు. తెలుగులో క్రేజ్ కోసం చిరంజీవి పేరు ఉపయోగించుకున్న అల్లు అర్జున్, బాలీవుడ్ విషయానికి వచ్చే సరికి స్వర్యం మార్చారు.