దువ్వాడ జగన్నాథంకి డబ్బింగ్ చెబుతున్న అల్లు అర్జున్
- May 3, 2017 / 07:55 AM ISTByFilmy Focus
సరైనోడు చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మూడు పాటలు, క్లైమాక్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని సమాచారం. క్లైమాక్స్ షూటింగ్ షెడ్యూల్ ఈ వారంలో మొదలు కానుంది. అనంతరం పాటల కోసం హరీష్ శంకర్ బృందం విదేశాలకు వెళ్లనుంది. అప్పటి లోపున డబ్బింగ్ కూడా పూర్తి చేస్తే బాగుంటుందని, అల్లు అర్జున్ తన డీజే పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారని చిత్ర బృందం తెలిపింది.
బ్రాహ్మణ యువకుడిగా, స్టైలిష్ గా డీజే లో బన్నీ అదరగొట్టనున్నట్లు రిలీజ్ చేసిన పోస్టర్స్ స్పష్టం చేస్తున్నాయి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 23 న విడుదల కానుంది. దీని తర్వాత అల్లు అర్జున్ వక్కంతు వంశీ దర్శకత్వంలో “నా పేరు సూర్య, నా ఊరు ఇండియా” అనే సినిమా చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















