Allu Arjun: ముంబయిలో గట్టి పీఆర్‌నే పట్టేశారుగా..!

సినిమా హీరోలకు పీఆర్‌ ఎంత ముఖ్యమో తెలుసా? లేకపోతే ఓసారి అల్లు అర్జున్‌ని చూడండి. ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే అతని పీఆర్‌ టీమ్‌ అంత బలంగా పని చేస్తుంటుంది కాబట్టి . ఏంటీ డౌటా… అయితే ఓసారి కరణ్‌ జోహార్‌, రోహిత్‌ శెట్టి ట్విటర్‌ ఖాతాలు ఓపెన్‌ చేయండి మీకే అర్థమైపోతుంది. బన్నీ పీఆర్‌ గురించి తెలుసుకోవడానికి వాళ్ల ట్విటర్‌లు ఎందుకా… ఒకసారి చూద్దురు మీకే తెలిసిపోతుంది. ఏంటీ… వాళ్ల ట్విటర్‌ ఖాతాలు చూసి వచ్చారా? ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఏం కనిపించాయి అల్లు అర్జున్‌ పేర్లు, థ్యాంక్యూలు, వీడియో కనిపిస్తాయి. ఇటీవల జరిగిన ‘వరుడు కావలెను’ ప్రచార కార్యక్రమంలోనిది. ఆ సినిమా గురించి చెబుతూ చెబుతూ… బాలీవుడ్‌ సినిమా ‘సూర్య వంశీ’ గురించి కూడా చెప్పుకొచ్చాడు బన్నీ. ఇదేదో ఫ్లో చెప్పింది కాదని, దీని వెనుక పెద్ద ఆలోచనే ఉందని అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. బాలీవుడ్‌లో తన సత్తా చాటాలని బన్నీ చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నాడు. దాని కోసం ‘పుష్ప’ సినిమాను ఆయుధంగా చేసుకున్నాడు.

పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘పుష్ప’కు బాలీవుడ్‌లో అంత క్రేజ్‌ లేదు. ఎందుకంటే బన్నీ తొలి హిందీ సినిమాఅవుతుంది ఇది. దీంతో బాలీవుడ్‌లో ఓ మంచి పీఆర్‌ టీమ్‌ను సిద్ధం చేసుకున్నారట. ఈ క్రమంలో ‘వరుడు కావలెను’ కార్యక్రమంలో ‘సూర్య వంశీ’ పేరు ఎత్తారట.వెంటనే బన్నీ ముంబయి పీఆర్‌ టీమ్‌ యాక్టివేట్‌ అయ్యిందని టాక్‌. దాని రియాక్షనే ‘సూర్యవంశీ’ నిర్మాత కరణ్‌ జోహార్‌, దర్శకుడు రోహిత్‌ శెట్టి ట్వీట్లు అంటున్నారు. ఇదంతా చూస్తుంటే బాలీవుడ్‌ పీఆర్‌కి మంచి టీమ్‌ ఎంత ముఖ్యమో అర్థమవుతోంది కదా.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus