Allu Arjun: స్నేహారెడ్డిపై అల్లు అర్జున్ ప్రేమకు ఫిదా కావాల్సిందే!

బన్నీ స్నేహారెడ్డి క్యూట్ కపుల్ కాగా ఈ జోడీని అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2011 సంవత్సరం మార్చి నెల 6వ తేదీన బన్నీ స్నేహారెడ్డి మ్యారేజ్ జరిగిందనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. హ్యాపీ ఆనివర్సరీ క్యూటీ అంటూ బన్నీ స్నేహారెడ్డి గురించి పోస్ట్ చేయడం గమనార్హం. బన్నీ చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

స్నేహారెడ్డిపై బన్నీ ప్రేమకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. బన్నీ స్నేహారెడ్డి కలకాలం కలిసి అన్యోన్యంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు బన్నీ కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పుష్ప2 మూవీ షూట్ లో బన్నీ పాల్గొంటుండగా పుష్ప ది రైజ్ ను మించి పుష్ప ది రూల్ ఉండనుందని సమాచారం. పుష్పరాజ్ పాత్ర ఎదుగుదలను ప్రధానంగా పుష్ప2 లో చూపించనున్నారు. పుష్ప2 బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా మేకర్స్ ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు.

సుకుమార్ ఈ సినిమాకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా పారితోషికాల కోసమే 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు అవుతోందని తెలుస్తోంది. సుకుమార్ ఈ సినిమా 2000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించాలని భావిస్తున్నారు. పుష్ప2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ అని సమాచారం.

తను హీరోగా తెరకెక్కే ప్రతి మూవీ ప్రత్యేకంగా ఉండాలని బన్నీ భావిస్తున్నారు. భిన్నమైన కథలకు అల్లు అర్జున్ ఓటేస్తున్నారు. బన్నీ సందీప్ రెడ్డి వంగా కాంబో మూవీపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కెరీర్ విషయంలో బన్నీ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus