Allu Arjun: అలా.. నవారు మంచంపై అల్లు అర్జున్ అండ్ కిడ్స్!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఐకాన్ స్టార్ అనే కొత్త ట్యాగ్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా వరల్డ్ లో బన్నీ ఎన్ని బిరుదులు అందుకున్నా కూడా ఫ్యామిలీ లైఫ్ కు వచ్చేసరికి మాత్రం పర్ఫెక్ ఫ్యామిలీ మ్యాన్ అయిపోతాడు. వీలైనంత ఎక్కువ సమయాన్ని వాళ్ళతో గడిపేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. అల్లు అర్హ, అల్లు అయాన్ డాడితో ఎంత సరదాగా ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇక వారికి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ ను భార్య అల్లు స్నేహ రెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇటీవల కూడా మరొక లవ్లీ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. బన్నీ చాలా సింపుల్ గా నవారు మంచంపై పిల్లలతో ముచ్చట్లు పెట్టాడు. ఆకాశంలో ఏదో చూపిస్తూ వారికి అనేక రకాల కథలను చెబుతున్నట్లు అనిపిస్తోంది. ఈ కాలంలో డబ్బున్న ఫ్యామిలీస్ లలో ఇలాంటి ఆప్యాయతలు ప్రేమలు కనిపించడం చాలా రేర్.

కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఆ దూరం కాస్త తగ్గుతూ వస్తోంది. ఇక బన్నీ మాత్రం పరిస్థితులు ఎలా ఉన్నా కూడా పిల్లలకు ఎక్కువగా గ్యాప్ ఇవ్వడు. వారి లోకంలోకి వెళ్లిమరి ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక నెక్స్ట్ ఈ ఐకాన్ స్టార్ సుకుమార్ పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus