Allu Arjun: కేబుల్ బ్రిడ్జ్ పై బన్నీ ఫ్యామిలీ.. వీడియో వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సమయం దొరికితే తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చూస్తుంటారు. ఎప్పటికప్పుడు తన కూతురు, కొడుకుతో కలిసి అల్లరి చేస్తూ కనిపిస్తాడు బన్నీ. తాజాగా బన్నీ మిడ్ నైట్ తన ఫ్యామిలీను తీసుకొని బయటకు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను అల్లు స్నేహారెడ్డి షేర్ చేయడంతో.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొన్నిరోజులుగా హైదరాబాద్ లో నిర్విరామంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

అలా జోరున వాన కురుస్తున్న సమయంలో బన్నీ తన ఫ్యామిలీను తీసుకొని రోడ్డు మీదకు వచ్చారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు హాట్ ప్లేస్ గా మారిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు, సాధారణ ప్రజలు ఇలా అందరూ కూడా అర్ధరాత్రి అలా కేబుల్ బ్రిడ్జ్ అందాలను చూస్తూ తరిస్తున్నారు. బన్నీ తన కారులో స్నేహారెడ్డి, అర్హ, అయాన్ లను తీసుకొని కేబుల్ బ్రిడ్జ్ పై చక్కర్లు కొట్టేశారు. స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇందులో బన్నీ పెద్దగా కనిపించకపోయినా.. అర్హ, అయాన్ లు మాత్రం కనిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది.


‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus