Pushpa Movie: బన్నీ సినిమా వాయిదా పడక తప్పదా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న ఏ సినిమా కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఓపక్క కరోనా పరిస్థితులు.. మరోపక్క ఇండస్ట్రీలో సమస్యల కారణంగా పెద్ద సినిమాలన్నీ విడుదల వాయిదా పడుతున్నాయి. తాజాగా ‘పుష్ప’ సినిమా యూనిట్ కి మరో సమస్య వచ్చి పడింది. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి భాగాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు.

ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. కానీ ఇప్పుడు అనుకున్న టైమ్ కి సినిమా వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి. ఇటీవల ‘పుష్ప’ షూటింగ్ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. ప్రస్తుతం ఓ పాటకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇది కాకుండా మరో రెండు పాటలు, కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. ఈలోగా తుఫాన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో తాత్కాలికంగా షూటింగ్ ఆగిపోయింది.

అనుకూల వాతావరణ పరిస్థితుల్లో షూటింగ్ చేయడం చిత్రబృందానికి సవాల్ గా మారింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే.. అక్టోబర్ చివరినాటికి షూటింగ్ పూర్తి చేయడం కష్టమని చిత్రపరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త విడుదల తేదీపై ‘పుష్ప’ టీమ్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తోన్ ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus