Allu Sirish: ఆయన జడ్జిమెంట్ పై శిరీష్ కామెంట్స్!

టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. చాలా ఏళ్లుగా ఆయన తన బ్యానర్ పై సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఆయన జడ్జిమెంట్ కి మంచి పేరుంది. ప్రేక్షకులకు నచ్చే కథలను ఎన్నుకొని సినిమాలను నిర్మిస్తుంటారు. ఆ విధంగా ఎన్నో విజయాలను అందుకున్నారు. ఆయన ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు హీరోలుగా.. ఒకరు నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. రీసెంట్ గా ఆయన చిన్న కొడుకు అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో హిట్టు కొట్టారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అల్లు శిరీష్. ఈ సందర్భంగా తన తండ్రి గురించి మాట్లాడారు. కథల జడ్జిమెంట్ విషయంలో తన తండ్రికి తిరుగులేదని.. అది తన సినిమాల విషయంలోనే అనుభవపూర్వకంగా అర్థమైందని అన్నారు. ‘ఊర్వశివో రాక్షసివో’ ఒరిజినల్ వెర్షన్ ‘ప్రేమ ప్యార్ కాదల్’ చూసి.. ఈ కథ శిరీష్ కి నప్పుతుందని నమ్మి తనకు సజెస్ట్ చేసింది తన తండ్రే అని చెప్పారు.

ఇదివరకు తను హీరోగా నటించిన ‘గౌరవం’, ‘ఒక్క క్షణం’, ‘ఏబీసీడీ’ వంటి సినిమాలన్నీ సొంత నిర్ణయాలతో ఎన్నకున్న సినిమాలని.. తన తండ్రి వద్దని చెప్పిన కథలు కూడా చేశానని గుర్తుచేసుకున్నారు. ‘ఊర్వశివో రాక్షసివో’ కథ నచ్చి ఆయన సినిమా నిర్మిద్దామని అనుకున్న తరువాత హీరోగా నేను సెట్ అవుతానని నాతోనే సినిమా తీశారని శిరీష్ చెప్పారు.

ఈ సినిమా రిజల్ట్ చూసిన తరువాత సినిమా గురించి నాన్నకే ఎక్కువ తెలుసని అనిపించింది. జడ్జిమెంట్ విషయంలో ఆయనే రైట్ అని అర్థమైందని.. ఇకపై ఆయన ఓకే చెబితేనే సినిమాలు చేస్తానని.. వద్దంటే చేయదలుచుకోలేదని తెలిపారు. తన కెరీర్ విషయంలోనే కాకుండా వ్యక్తిగా ఎదుగుదలలో కూడా తన తండ్రి పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు అల్లు శిరీష్.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus