అల్లు అరవింద్ (Allu Aravind) చిన్న కుమారుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టాడు అల్లు శిరీష్ (Allu Sirish). ‘గౌరవం’ (Gouravam) సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చారు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా కంటెంట్ కి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఆ తర్వాత చేసిన ‘కొత్త జంట’ (Kotha Janta) బాగానే ఆడింది. ‘శ్రీరస్తు శుభమస్తు’ (Srirastu Subhamastu) కూడా డీసెంట్ సక్సెస్ అనిపించుకుంది. అటు తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ‘ఒక్క క్షణం’ (Okka Kshanam) కొంచెం యావరేజ్ అనిపించుకున్నా… ‘ఎబిసిడి’ (ABCD) ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo) ‘బడ్డీ’ (Buddy) వంటి సినిమాలు డిజాస్టర్లుగా మారాయి.
ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో చూసుకుంటే అల్లు శిరీష్ వరుసగా సినిమాలు చేయడం లేదు. సెలక్టివ్ గానే చేస్తున్నాడు. ‘గీతా’ కాంపౌండ్ కి చాలా మంది దర్శకులు వెళ్లి శిరీష్ కు కథలు చెబుతున్నా.. అతను ఓకే చేయడం లేదు. నచ్చిన కథలకే ఓకే చెబుతున్నాడు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం హిందీలో కూడా పెద్ద స్టార్ హీరో.
‘పుష్ప’ (Pushpa) ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాలతో అతనికి వచ్చిన ఇమేజ్ వేరు. ఇక నుండి అల్లు అర్జున్ చేసే సినిమాలకి అక్కడ భారీ డిమాండ్ ఏర్పడటం ఖాయం. ‘మరి శిరీష్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా?’ అనే చర్చ కూడా ఇప్పుడు ఊపందుకుంది. అయితే శిరీష్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో ఇచ్చేశాడు. బహుశా ఈ విషయం చాలా మందికి తెలీదు.
ఆ మాటకొస్తే శిరీష్.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందే బాలీవుడ్ సినిమాతో. అవును చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అంకుశం’ సినిమాని హిందీలో ‘ప్రతిబంద్’ గా రీమేక్ చేశారు. ఇది అక్కడ బాగానే ఆడింది. ఈ సినిమాలో అల్లు శిరీష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. బహుశా ఈ విషయం అతి తక్కువ మందికే తెలిసుండొచ్చు.